Acharya: 20 ఎకరాలు, కోట్ల రూపాయల ఖర్చు.. ధర్మస్థలి సెట్‌ గురించి కొరటాల ఇంట్రెస్టింగ్ విశేషాలు..

Acharya: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఇంత వరకు అపజయం ఎరగని కొరటాల శివ (koratala Shiva) దర్శకత్వం వహించడం, రామ్‌చరణ్‌ (Ramcharan) తొలిసారి చిరుతో ఎక్కువ నిడివి ఉన్న పాత్రలో నటిస్తుండడంతో...

Acharya: 20 ఎకరాలు, కోట్ల రూపాయల ఖర్చు.. ధర్మస్థలి సెట్‌ గురించి కొరటాల ఇంట్రెస్టింగ్ విశేషాలు..
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 24, 2022 | 5:37 PM

Acharya: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఇంత వరకు అపజయం ఎరగని కొరటాల శివ (koratala Shiva) దర్శకత్వం వహించడం, రామ్‌చరణ్‌ (Ramcharan) తొలిసారి చిరుతో ఎక్కువ నిడివి ఉన్న పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై పాజిటివ్‌ వైబ్స్‌ తీసుకొచ్చాయి. ఏప్రిల్‌ 29న ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే శనివారం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్‌.

ఇక డైరెక్టర్‌ కొరటాల కూడా సినిమాకు సంబంధించిన పలు విషయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమాలో ధర్మస్థలి సెట్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలో ఎక్కువ శాతం షూటింగ్‌ జరుపుకున్న ఈ సెట్‌, సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, సినిమా చూసిన వారు ధర్మస్థలిని చూడాలని కోరుకుంటారని కొరటాల చెప్పుకొచ్చారు.

ఈ విషయమై కొరటాల మాట్లాడుతూ.. ‘సినిమా అనుకున్నప్పుడు ఓ మంచి టెంపుల్ టౌన్‌ను కావాలనుకున్నాం. చాలా ప్రాంతాలు తిరిగాం. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు అంశాలు నచ్చాయి. షూటింగ్‌ కాధ్యం కాదేమో అనిపించింది. దీంతో చివరికి ధర్మస్థలిని నిర్మిచాలనుకున్నాం. ధర్మం గురించి చెప్పే కథ కాబట్టి ఆ టౌన్‌ పేరు కూడా ధర్మస్థలి అని పేరు పెట్టాం. ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ ఎన్నో దేవాలయాలు సందర్శించి, సెట్‌ నిర్మించారు. భారత దేశ సినిమా ఇండస్ట్రీలో సెట్‌కోసం అత్యధికంగా ఖర్చు చేసిన వాటిలో ఇదీ ఒకటి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి 20 ఎకరాల్లో సెట్‌ని నిర్మించాం’ అని కొరటాల చెప్పుకొచ్చారు. మరి ధర్మస్థలి సెట్‌ కోసం కొరటాల టీమ్‌ పడ్డ కష్టం ఎలాంటిదో మీరూ ఓసారి చూసేయండి..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Andhra Pradesh: మానవత్వం పరిమళించిన వేళ.. యాచకురాలికి పురుడు పోసిన స్థానిక మహిళలు

Health Tips: చర్మం, జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా..? ఈ ఆహారంతో చెక్ పెట్టండి..

Lagadapati Rajagopal: నాలుగేళ్లుగా పత్తాలేని లగడపాటి ప్రత్యక్షం.. ఆంధ్రా ఆక్టోపస్‌ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారా?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే