Andhra Pradesh: మానవత్వం పరిమళించిన వేళ.. యాచకురాలికి పురుడు పోసిన స్థానిక మహిళలు
పురిటి నొప్పులతో అల్లాడుతున్న యాచకురాలికి సాయంగా నిలిచారు స్థానిక మహిళలు. బట్టలు అడ్డుపెట్టి పురుడు పోశారు.
నిత్యం హత్యలు.. అత్యాచారాలు, పసిబిడ్డలను రోడ్లపై వదిలేసి వెళ్లడాలు లాంటి ఘటనలతో కుళ్లిపోతున్న ఈ సమాజంలో మానవత్వం పరిమళించేలా చేసిందో ఘటన. పురిటి నొప్పులతో విలవిల లాడుతున్న నిండు గర్భిణిపట్ల సహృదయం చాటారు స్థానికులు. యాచకురాలని దూరంగా ఉండకుండా.. నొప్పులతో బాధపడుతున్న తోటి మహిళ పట్ల ఔదార్యం చాటారు. బట్టలు అడ్డుపెట్టి పురుడు పోశారు స్థానిక మహిళలు. అంతకు ముందు ఆమె బాధను చూసిన స్థానికులు 108కి సమచారం ఇచ్చారు. అది వచ్చేలోపే యాచకురాలు ఆరుబైటే మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండడంతో 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారాకా తిరుమల(Dwaraka Tirumala)లోని శేషాచల కొండపై ఉన్న శివాలయం సమీపంలో జరిగింది. యాచకురాలికి సాయంగా నిలిచిన స్థానికులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Also Read: AP: వీరి ఇంగ్లీష్ వింటే మంచు లక్ష్మి మురిసిపోవడం ఖాయం.. అదరగొడుతున్న బెండపూడి అమ్మాయిలు