Keerthy Suresh: మరోసారి మహానటి నట విశ్వరూపం.. డీగ్లామర్‌ పాత్రలో ఆకట్టుకుంటోన్న కీర్తి సురేష్‌..

Keerthy Suresh: సినిమా సినిమాకు తనదైన నటనతో ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది అందాల తార కీర్తి సురేష్‌. మహానటి (Mahanati) సినిమాతో నేషనల్‌ అవార్డ్‌ అందుకున్న ఈ చిన్నది వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది...

Keerthy Suresh: మరోసారి మహానటి నట విశ్వరూపం.. డీగ్లామర్‌ పాత్రలో ఆకట్టుకుంటోన్న కీర్తి సురేష్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 24, 2022 | 2:50 PM

Keerthy Suresh: సినిమా సినిమాకు తనదైన నటనతో ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది అందాల తార కీర్తి సురేష్‌. మహానటి (Mahanati) సినిమాతో నేషనల్‌ అవార్డ్‌ అందుకున్న ఈ చిన్నది వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. కేవలం భారీ బడ్జెట్ చిత్రాలకే పరిమితం కాకుండా తక్కువ బడ్జెట్ చిత్రాల్లోనూ నటిస్తోందీ బ్యూటీ. ముఖ్యంగా లేడి ఓరియెంటెండ్‌ సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. ఈ క్రమంలోనే కీర్తి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ రోల్‌తో ప్రేక్షకులకు ఆకట్టుకుకోవడానికి సిద్ధమైంది. ఈసారి డిజిటల్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునే పనిలో పడింది.

అమెజాన్‌ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ‘సాని కాయిదం’ అనే తమిళ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందు రానుంది కీర్తి. మే 6 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘చిన్ని’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో కీర్తి పూర్తిగా డీగ్లామర్‌ పాత్రలో నటిస్తోంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఎదురు తిరిగిన ఓ మహిళ ఎలా పగ తీర్చుకుందన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కీర్తి చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. మరోసారి నటనకు అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోన్న కీర్తికి ఈ సినిమా ఎలాంటి పేరు తెస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Mann Ki Baat: జేబులో రుపాయి లేకుండానే ప్రపంచాన్ని చుట్టేసే రోజులు వచ్చాయి.. ‘మన్ కీ బాత్’‌లో ప్రధాని మోదీ

Zodiac Sign: ఈ రాశి అమ్మాయిలను వివాహం చేసుకున్నవారు అదృష్టాన్ని సొంతం చేసుకున్నట్లే.. అభివృద్ధిని సాధిస్తారు…

Bahubali Monkey: కండలు చూపిస్తూ వింతగా నడుస్తున్న కోతి ఈ బాహుబలి ముందు ప్రభాస్‌ కూడా చిన్నబోవాల్సిందే..!