సెకండ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న కో’బ్రో’స్.. త్వరలోనే మరిన్ని అప్‏డేట్స్ ఇస్తానంటున్న టాప్ డైరెక్టర్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Feb 18, 2021 | 7:22 PM

యంగ్ హీరో వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం :"ఎఫ్3" సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. ఇందులో తమన్నా, మెహరీన్‏లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని

సెకండ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న కో'బ్రో'స్.. త్వరలోనే మరిన్ని అప్‏డేట్స్ ఇస్తానంటున్న టాప్ డైరెక్టర్..

యంగ్ హీరో వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం :”ఎఫ్3″ సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. ఇందులో తమన్నా, మెహరీన్‏లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. అంతే వేగంతో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తన ట్విట్టర్‏లో “సెకండ్ షెడ్యూల్ పూర్తి చేశాం. మూడో షెడ్యూల్ స్టార్ట్ కాగానే మరిన్ని అప్‏డేట్స్ ఇస్తాం” అని ట్వీట్ చేశాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ మూవీని ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. గతంలో వీరి ముగ్గురి కాంబోలో తెరకెక్కిన “ఎఫ్ 2” సినిమా కామెడీ సక్సెస్ ఫుల్‏గా నిలిచింది. దీంతో ఆ సినిమాకు సిక్వెల్‏గా ఎఫ్3ని తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి.

Also Read:  వరుసగా ఐదు సినిమాలు హిట్.. విజయ పరంపరలో అనిల్ రావిపూడి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu