Sai Pallavi: సాయి పల్లవి ముంబయి వెళ్లింది అందుకేనా.? ఆ సినిమా మొదలైందా.?
బాలీవుడ్‌కు చెందిన అగ్ర దర్శకుడు నితీశ్ తివారీ 'రామాయణం' ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర యూనిట్ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఈ చిత్రంలో లీడ్ రోల్‌లో సాయి పల్లవితో పాటు రణ్‌బీర్ కపూర్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు...
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఏ చిన్న వార్తయినా క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. మరీ ముఖ్యంగా సినిమాలకు, సినీ తారలకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా నటి సాయి పల్లవికి సంబంధించి ఇలాంటి ఓ వార్తే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాయి పల్లవి ప్రస్తుతం ముంబయిలో ఉందంటూ ఓ అభిమాని పోస్ట్ చేసిన ఫొటో.. ఎన్నో ప్రశ్నలకు తెర తీసింది. ఇంతకీ విషయం ఏంటంటే..
బాలీవుడ్‌కు చెందిన అగ్ర దర్శకుడు నితీశ్ తివారీ ‘రామాయణం’ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర యూనిట్ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఈ చిత్రంలో లీడ్ రోల్‌లో సాయి పల్లవితో పాటు రణ్‌బీర్ కపూర్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు సాయి పల్లవి నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా సాయి పల్లవి ముంబయికి వెళ్లిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో సాయి పల్లవి రామాయణం సినిమాలో నటిస్తుందన్న వార్తలకు బలం చేకూర్చినట్లైంది. గతంలో సాయిపల్లవి, రణ్‌బీర్‌లకు సంబంధించి ఓ ఏఐ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా సాయిపల్లవి ముంబయిలో కనిపించేసిరికి ఈ వార్తలు మరింత బలం చేకూర్చినట్లైంది. సాయిపల్లవి ముంబయిలో ఉన్న ఫొటోను చూసిన ఆమె ఫ్యాన్స్.. రామాయణం మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకే ఆమె వెళ్లినట్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఇక రామాయణం చిత్రాన్ని రెండు పార్ట్స్‌గా తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి శ్రీలంకలో షూటింగ్ ప్రారంభంకానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. ఇందుకోసం శ్రీలంకలో భారీ సెట్టింగ్ వేయనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్, మధు వంతెన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గతంలో అల్లు అరవింద్ చెప్పి షూటింగ్‌కు ముందే సినిమాపై అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..