Tollywood: సూర్య సరసన క్రేజీ ఛాన్స్ మిస్.. కట్ చేస్తే.. ప్రభాస్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్.. ఈ బ్యూటీ ఎవరంటే..
కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోవచ్చు.. కానీ అందులోని పాటలు మాత్రం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటాయి. సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ పాటల హవా మాత్రం ఏత్రం తగ్గదు. అలాంటి చిత్రాల్లో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఒకటి. అయితే ఈ సినిమాను మిస్సైన ఓ బ్యూటీ గురించి ఇఫ్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో తెలుసుకుందామా.

దక్షిణాది చిత్రాల్లో ప్రేమకథలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు అనేకం. అయితే అందమైన ప్రేమకథలను తెరపైకి తీసుకువచ్చే డైరెక్టర్లలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒకరు. తెలుగులో ఏమాయ చేసావే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అలాగే తమిలంలో అనేక చిత్రాలను తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ఆయన రూపొందించిన లవ్ స్టోరీలలో వారణం ఆయిరం ఒకటి. ఈ సినిమాను తెలుగులో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ పేరుతో రిలీజ్ చేశారు. కమర్షియల్ హిట్ కాకపోయినా ఈ సినిమా ఇప్పటికి అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ససూర్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు ప్రధాన బలం మ్యూజిక్. హారిస్ జయరాజ్ సంగీతం అందించగా.. ఈ చిత్రంలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..
ఈ సినిమాలోని ప్రతి సాంగ్ ఇఫ్పటికీ యూట్యూబ్, సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. ఇందుల సూర్య సరసన సమీరా రెడ్డి కథానాయికగా నటించింది. వీరిద్దరి జోడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రానికి సమీరా కంటే ముందు బాలీవుడ్ బ్యూటీ దీపికాను అనుకున్నారట డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెడుతున్న సమయంలోనే దీపికాకు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఆఫర్ వచ్చిందట. కానీ అప్పటికే ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుఖ్ జోడిగా ఓం శాంతి ఓం మూవీలో నటించే ఛాన్స్ అందుకుంది. అప్పటికే షూటింగ్ స్టార్ట్ కావడంతో షెడ్యూల్ కారణంగా సూర్య సినిమాను వదులుకుందట.
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..
దీంతో ఈ సినిమాను సమీరా రెడ్డిని ఎంపిక చేశారు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఈ మూవీతోనే తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది సమీరా. మొదటి మూవీతోనే అందరి ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో రాణించింది. తెలుగులో ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సమీరా.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
దీపికా పదుకొణే..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..
