AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana TET Results 2026: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే..! వారికోసం సెప్టెంబర్‌లో స్పెషల్ టెట్

Telangana TET Results 2026: తెలంగాణ TG TET-2026 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 50,544 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, ఉత్తీర్ణత శాతం 43.94గా నమోదైంది. మహిళలు అధిక సంఖ్యలో క్వాలిఫై కాగా, ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్‌ను సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

Telangana TET Results 2026: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే..! వారికోసం సెప్టెంబర్‌లో స్పెషల్ టెట్
Telangana Tet Results 2026 Released
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jul 13, 2026 | 3:40 PM

Share

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష TG TET 2026 ఫలితాలు సోమవారం మధ్యాహ్నం (జూలై 13న ) విడుదలయ్యాయి. ఈ ఏడాది జూన్ 16 నుంచి జూన్ 22 వరకు మొత్తం 10 సెషన్లలో ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,15,028 మంది పరీక్షకు హాజరయ్యారు. తుది ఫలితాలలో మొత్తం 50,544 మంది అభ్యర్థులు అర్హత సాధించి, 43.94 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు.

పురుషుల కంటే మహిళలే టెట్‌లో సత్తా చాటారు. మొత్తం క్వాలిఫై అయిన వారిలో మహిళలు 32,970 మంది ఉండగా, పురుషులు 17,568 మంది, ట్రాన్స్‌జెండర్లు ఆరుగురు ఉన్నారు. పేపర్ల వారీగా చూస్తే.. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించిన పేపర్-1 లో అత్యధికంగా 65.29 శాతం మంది క్వాలిఫై అయ్యారు. అయితే ఆరు నుంచి ఎనిమిదో తరగతి బోధనకు రాసే పేపర్-2 ఫలితాల్లో మాత్రం గణనీయమైన తేడాలు కనిపించాయి. పేపర్-2 మ్యాథ్స్ & సైన్స్ విభాగంలో 40.76 శాతం మంది అర్హత సాధించగా, సోషల్ స్టడీస్ విభాగంలో అత్యల్పంగా కేవలం 25.79 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ టీచర్లకు టెట్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ పరీక్షలో 23,623 మంది ఇన్ సర్వీస్ టీచర్లు పరీక్ష రాయగా వారిలో 8,809 మంది మాత్రమే అర్హత సాధించారు.

ఈ డైరెక్ట్ లింక్ ద్వారా తెలంగాణ టెట్ 2026 ఫలితాలు తెలుసుకోవచ్చు.

ఇదే సమయంలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు విద్యాశాఖ మరో కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్ స్కూల్స్ మరియు రెసిడెన్షియల్ సొసైటీల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను జూలై 21, 2026న విడుదల చేసి, సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 11, 2026 మధ్య కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మీ దుంపలు తెగ మీరెక్కడ దొరికార్రా సామీ.. కోటికిపైగా బెడ్‌షీట్లు
మీ దుంపలు తెగ మీరెక్కడ దొరికార్రా సామీ.. కోటికిపైగా బెడ్‌షీట్లు
ఎడారిలో పండే పంట మన తెలంగాణలో..కోట్లలో లాభం
ఎడారిలో పండే పంట మన తెలంగాణలో..కోట్లలో లాభం
తిరుమలలో కర్ణాటక ప్రముఖులకు తొలి హారతి వీక్షణ అవకాశం.. సీఎం..
తిరుమలలో కర్ణాటక ప్రముఖులకు తొలి హారతి వీక్షణ అవకాశం.. సీఎం..
చిన్న మొత్తంతో కోటీశ్వరులను చేసే SIP ఫార్ములా ఇది..
చిన్న మొత్తంతో కోటీశ్వరులను చేసే SIP ఫార్ములా ఇది..
సెక్యూరిటీ లేకుండానే రోడ్లపైకి వచ్చిన హిట్ మ్యాన్
సెక్యూరిటీ లేకుండానే రోడ్లపైకి వచ్చిన హిట్ మ్యాన్
పాత బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే వారంటీ క్యాన్సిల్ అవుతుందా?..
పాత బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే వారంటీ క్యాన్సిల్ అవుతుందా?..
రాసి పెట్టుకోండి.. వీరి జీవితంలో గొప్ప మలుపు
రాసి పెట్టుకోండి.. వీరి జీవితంలో గొప్ప మలుపు
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
టీమిండియా ఓటమికి గల అసలు కారణాన్ని వెల్లడించిన మాజీ క్రికెటర్
టీమిండియా ఓటమికి గల అసలు కారణాన్ని వెల్లడించిన మాజీ క్రికెటర్
మామిడి జీడిని పారేస్తున్నారా? దానిలోని అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు
మామిడి జీడిని పారేస్తున్నారా? దానిలోని అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు