కరోనాకి వ్యాక్సిన్ రాకపోవచ్చు.. కీలక వ్యాఖ్యలు చేసిన బాలయ్య
ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ వ్యాక్సిన్ వస్తేనే మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయని అందరూ బలంగా నమ్ముతున్నారు.
Balayya Corona Vaccine: ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ వ్యాక్సిన్ వస్తేనే మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఇలాంటి నేపథ్యంలో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ రాకపోవచ్చునని ఆయన అన్నారు.సెహరి మూవీ ఫస్ట్ లుక్ లాంచ్‌లో పాల్గొన్న బాలయ్య.. కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. (బాలయ్య-నాగశౌర్య మల్టీస్టారర్.. కాంబోను సెట్ చేసిన ప్రముఖ నిర్మాత..!)
”కరోనా మనతోనే ఉంటుంది. దాంతో మనం సహజీవనం చేయాల్సి వస్తుంది. వ్యాక్సిన్ గురించి వార్తలు వస్తున్నాయి. కానీ అది అంత సులభం కాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అని బాలయ్య అన్నారు. కాగా కరోనా విజృంభణ ప్రారంభమైన సమయంలో సీఎం వైఎస్ జగన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కరోనాతో సహజీవనం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ ఆ తరువాత ప్రధాని మోదీ, డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనామ్ సహా పలువురు ఇదే విషయాన్ని తెలిపారు. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో సహజీవనం తప్పదని వారు అన్నారు. ఇక ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న సమయంలో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. (ఇప్పుడు డెలివరీ బాయ్‌గా చేస్తున్నా.. నెదర్లాండ్ క్రికెటర్ పాల్ ఆవేదన )