AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బన్నీ ‘పుష్ప’లో పాత్ర.. రాక్‌స్టార్‌ గడ్డం పెంచుతోంది అందుకోసమేనా..!

మ్యూజిక్‌ డైరెక్టర్ రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ మధ్యకాలంలో కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. గుబురు గడ్డంతో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా కనిపిస్తున్నాడు.

బన్నీ 'పుష్ప'లో పాత్ర.. రాక్‌స్టార్‌ గడ్డం పెంచుతోంది అందుకోసమేనా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 16, 2020 | 5:07 PM

Share

Devi Sri Prasad: మ్యూజిక్‌ డైరెక్టర్ రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ మధ్యకాలంలో కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. గుబురు గడ్డంతో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా కనిపిస్తున్నాడు. లాక్‌డౌన్‌లో ఇంటి పట్టునే ఉంటున్న చాలా మంది గడ్డాలు పెంచినప్పటికీ.. ఆ తరువాత తీసేసుకున్నారు. కానీ దేవీ మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నారు. ఈ క్రమంలో ఈ మ్యూజిక్‌ మెజీషియన్‌కి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే బన్నీ ‘పుష్ప’లో దేవీ నటించబోతున్నాడని. (కరోనాకి వ్యాక్సిన్ రాకపోవచ్చు.. కీలక వ్యాఖ్యలు చేసిన బాలయ్య)

బన్నీ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప’ షూటింగ్‌ ఇటీవల మొదలైంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకీ దేవీ సంగీతం అందిస్తుండగా.. ఇందులో అతడు  నటించనున్నాడని, అందుకోసమే గడ్డం పెంచుకున్నాడని తెలుస్తోంది. సుకుమార్, బన్నీ ఇద్దరూ దేవీకి మంచి స్నేహితులు. సుకుమార్ అయితే దేవీని తన ఆత్మతో పోలుస్తుంటారు. ఈ క్రమంలో దేవీని నటుడిగా చూడాలనుందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సుకుమార్‌.. ఇప్పుడు పుష్పలో అతడి కోసం ఓ పాత్రను ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకోసం రాక్‌స్టార్ ఈ కొత్త గెటప్‌ అని సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. (బాలయ్య-నాగశౌర్య మల్టీస్టారర్‌.. కాంబోను సెట్ చేసిన ప్రముఖ నిర్మాత..!)

కాగా సంగీత దర్శకుడిగా ఎన్నో హిట్‌ ఆల్బమ్‌లు ఇచ్చిన దేవీ.. శంకర్ దాదా ఎంబీబీఎస్‌, శంకర్ దాదా జిందాబాద్‌, అత్తారింటికి దారేది, ఖైదీ నంబర్‌.150, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాల్లోని పాటల్లో మెరిశారు. అలాగే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల కోసం రూపొందిన ప్రమోషనల్‌ పాటల్లో దేవీ-బన్నీ ఇద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. (ఇప్పుడు డెలివరీ బాయ్‌గా చేస్తున్నా.. నెదర్లాండ్‌ క్రికెటర్ పాల్‌ ఆవేదన )

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..