బాలయ్య-నాగశౌర్య మల్టీస్టారర్.. కాంబోను సెట్ చేసిన ప్రముఖ నిర్మాత..!
టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ల ట్రెండ్ బాగా నడుస్తోంది. మల్టీస్టారర్ చిత్రాలను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.
Balayya Naga Shaurya: టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ల ట్రెండ్ బాగా నడుస్తోంది. మల్టీస్టారర్ చిత్రాలను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీంతో దర్శకనిర్మాతలు సైతం మల్టీస్టారర్‌లు తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు మల్టీస్టారర్‌లు వచ్చి హిట్ అవ్వగా.. తాజాగా మరో క్రేజీ మల్టీస్టారర్‌ని తీసేందుకు ప్రముఖ నిర్మాత సిద్ధమయ్యారట. (ఇప్పుడు డెలివరీ బాయ్‌గా చేస్తున్నా.. నెదర్లాండ్ క్రికెటర్ పాల్ ఆవేదన )
ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆదిత్య 369, సమ్మోహనం, వంశానికొక్కడు వంటి చిత్రాలను నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ బాలకృష్ణ-నాగశౌర్యలతో ఓ మల్టీస్టారర్‌ని ప్లాన్ చేశారట. ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించే ఈ చిత్రంలో బాలయ్య పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుందట. ఇక ఇందులో మరో హీరో పాత్రకు నాగశౌర్యను సంప్రదించడం, ఆ హీరో వెంటనే ఓకే చెప్పేయడం జరిగిపోయాయని సమాచారం. త్వరలోనే ఈ క్రేజీ మల్టీస్టారర్‌పై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. (ప్రారంభమైన మంచు వర్షం.. ప్రముఖ కేదార్‌నాథ్ ఆలయం మూసివేత)
కాగా ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి దర్శకత్వంలో మూడోసారి నటిస్తున్నారు. ఇందులో సాయేషా సైగల్, పూర్ణ హీరోయిన్లుగా కనిపించనున్నారు. మరోవైపు నాగశౌర్య.. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వరుడు కావలెనులో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత అలా ఎలా ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో నటించనున్నారు. (‘ఛత్రపత్రి’ రీమేక్‌లో బెల్లంకొండ.. దర్శకత్వం వహించనున్న ప్రభాస్ దర్శకుడు..!)