‘ఛత్రపత్రి’ రీమేక్‌లో బెల్లంకొండ.. దర్శకత్వం వహించనున్న ప్రభాస్ దర్శకుడు..!

15 సంవత్సరాల తరువాత రెబల్‌ స్టార్ ప్రభాస్‌ నటించిన ఛత్రపతి హిందీలో రీమేక్‌ అవ్వబోతున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.

'ఛత్రపత్రి' రీమేక్‌లో బెల్లంకొండ.. దర్శకత్వం వహించనున్న ప్రభాస్ దర్శకుడు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 16, 2020 | 11:33 AM

Bellamkonda Chatrapathi remake: 15 సంవత్సరాల తరువాత రెబల్‌ స్టార్ ప్రభాస్‌ నటించిన ఛత్రపతి హిందీలో రీమేక్‌ అవ్వబోతున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ రీమేక్ ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అంతేకాదు బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (విషాదం.. పెళ్లైన 10 రోజులకే రోడ్డు ప్రమాదంలో మరణించిన కొత్త జంట)

అదేంటంటే ఈ ప్రాజెక్ట్‌కి సుజీత్‌ దర్శకత్వం వహించబోతున్నారట. రన్‌ రాజా రన్‌తో టాలీవుడ్‌కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుజీత్‌.. ఆ తరువాత ప్రభాస్ నటించిన సాహోకు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ నటించాలనుకుంటున్న లూసిఫర్ రీమేక్‌కి మొదట సుజీత్‌నే ఎంచుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన సుజీత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. (బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్, నటి లొస్లియా తండ్రి మృతి.. అప్పట్లో హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చి..!)

ఇక ప్రస్తుతం వేరే స్క్రిప్ట్‌లను రాసుకుంటున్న ఈ దర్శకుడికి ఇప్పుడు ఛత్రపతి రీమేక్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై నిర్మాతలు సుజీత్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంత..? ఒకవేళ ఛత్రపతి రీమేక్ ఆఫర్ వస్తే సుజీత్ ఒప్పుకుంటారా..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే బెల్లంకొండ ప్రస్తుతం అల్లుడు అదుర్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్‌కి రాగా.. ఈ ప్రాజెక్ట్ తరువాత ఛత్రపతిలో నటించనున్నట్లు సమాచారం. (కర్నూల్ జిల్లాలో దారుణం.. నాటు బాంబు పేలి ఏడోతరగతి విద్యార్థి మృతి)