AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విక్రమ్-ఇర్ఫాన్‌ పఠాన్‌ మూవీ టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల

హిట్, ఫ్లాప్‌లను పట్టించుకోకుండా వైవిధ్య కథల్లో నటించేందుకే ఆసక్తిని చూపే చియాన్ విక్రమ్.. ప్రస్తుతం అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. విక్రమ్ 58వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారానే టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అవుతున్నాడు. ఇక ఈ చిత్రంలో విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. దర్శకుడు కేఎస్ రవికుమార్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా క్రిస్మస్‌ను పురస్కరించుకొని ఈ మూవీ టైటిల్‌తో పాటు […]

విక్రమ్-ఇర్ఫాన్‌ పఠాన్‌ మూవీ టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 26, 2019 | 11:48 AM

Share

హిట్, ఫ్లాప్‌లను పట్టించుకోకుండా వైవిధ్య కథల్లో నటించేందుకే ఆసక్తిని చూపే చియాన్ విక్రమ్.. ప్రస్తుతం అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. విక్రమ్ 58వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారానే టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అవుతున్నాడు. ఇక ఈ చిత్రంలో విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. దర్శకుడు కేఎస్ రవికుమార్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా క్రిస్మస్‌ను పురస్కరించుకొని ఈ మూవీ టైటిల్‌తో పాటు పోస్టర్‌ను విడుదల చేశారు. మొదట ఈ మూవీకి అమర్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా కోబ్రాను ఫిక్స్ చేశారు.

ఈ సందర్భంగా వచ్చిన మోషన్ పోస్టర్‌ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు అర్థమవుతోంది. కాగా ఇందులో విక్రమ్ 25 పాత్రల్లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 7 స్క్రీన్ స్టూడియో నిర్మిస్తోన్న ఈ మూవీకి రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది జూన్‌లో కోబ్రాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కాగా గత కొన్నేళ్లుగా విక్రమ్ ఖాతాలో మంచి హిట్ లేదు. ఈ ఏడాది వచ్చిన కదరమ్ కోండన్(తెలుగులో మిస్టర్ కేకే) కమర్షియల్‌గా హిట్ అయినప్పటికీ.. గొప్ప విజయంగా నిలవలేదు. ఈ నేపథ్యంలో కోబ్రా చిత్రంపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు విక్రమ్. ఇదిలా ఉంటే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన ధ్రువ నచ్చిత్రమ్ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినప్పటికీ.. కొన్ని కారణాల వలన ఈ మూవీ ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.

Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బౌలర్లను ఉతికి ఆరేసిన పాక్ కుర్రాడు..మిన్హాస్ అంటే మనోడేనా?
భారత్ బౌలర్లను ఉతికి ఆరేసిన పాక్ కుర్రాడు..మిన్హాస్ అంటే మనోడేనా?
నచ్చింది వండుకొని తింటూ.. లక్షల్లో సంపాదించుకోవచ్చు!
నచ్చింది వండుకొని తింటూ.. లక్షల్లో సంపాదించుకోవచ్చు!