AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: రాజకీయాలకు దూరంగా ఉన్నా విమర్శిస్తున్నారు.. అందుకే స్పందించను.. మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు..

నేను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నా.. అయినా.. కొందరు నాపై అకారణంగా విమర్శలు చేస్తున్నారు .. ఆ విమర్శలకు నేను చేసిన మంచి పనులే జవాబు.. అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.. సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి చెప్పుకోచ్చారు.

Chiranjeevi: రాజకీయాలకు దూరంగా ఉన్నా విమర్శిస్తున్నారు.. అందుకే స్పందించను.. మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు..
Chiranjeevi
Shaik Madar Saheb
|

Updated on: Aug 06, 2025 | 4:05 PM

Share

నేను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నా.. అయినా.. కొందరు నాపై అకారణంగా విమర్శలు చేస్తున్నారు .. ఆ విమర్శలకు నేను చేసిన మంచి పనులే జవాబు.. అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.. సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి చెప్పుకోచ్చారు.. ఫీనిక్స్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌కు మెగాస్టార్ చిరంజీవి, తేజా సజ్జా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కొందరు తనపై ఆకారణంగా నోరు పారేసుకుంటున్నారని అన్నారు. ఇటీవల ఓ నాయకుడు తనపై విమర్శలు చేస్తే ఆ ప్రాంతానికే చెందిన మహిళ ఎదురు తిరిగిందన్నారు. ఆ వీడియో చూసి సదరు మహిళ గురించి వాకబు చేస్తే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆవిడ బిడ్డ ప్రాణం నిలబడిందని తెలిసిందన్నారు. ఎప్పుడైనా మనం చేసే పనులే మాట్లాడుతుంటాయంటూ చిరంజీవి వివరించారు.

వీడియో చూడండి..

ఒక జర్నలిస్ట్‌ మూలంగా తనకు బ్లడ్‌ బ్యాంక్‌ పెట్టాలనే ఆలోచన వచ్చిందని ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన రాసిన ఆర్టికల్‌ చదివిన తర్వాతే తనకు బ్లడ్ బ్యాంక్ పెట్టాలనే.. ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఆయనను ఇప్పటివరకూ చూడలేదు కానీ, ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటానని చిరంజీవి అన్నారు.

ఒకప్పుడు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని.. అందుకే.. ఆమెకు తానంటే గౌరవమని.. ఆ మాటలు విని తన హృదయం ఉప్పొంగిందంటూ చిరంజీవి పేర్కొన్నారు. అందుకే తాను ఎప్పుడూ సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ అలాగే.. దేనికీ.. స్పందించనంటూ పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి బ్లడ్‌ డొనేట్‌ చేసిన వారందరినీ అభినందించారు.

కాగా.. గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అనంతరం రాజ్యసభ సభ్యుడిగా.. కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చాలా ఏళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు