Pawan Kalyan Krish :తమ్ముడిపై చిరంజీవి ప్రశంసల జల్లు.. పవన్‌తో డిఫరెంట్ మూవీ చేయవచ్చని ఆలోచించిన క్రిష్‌పై పొగడ్తల వర్షం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ లో ఎన్నడూ లేనంత వరస సినిమాలను చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత పవన్ తిరిగి వెండి తెరపై వకీల్ సాబ్ తో రానున్నాడు.. ఇక తాజాగా క్రిష్ దర్శకత్వంలో...

Pawan Kalyan Krish :తమ్ముడిపై చిరంజీవి ప్రశంసల జల్లు.. పవన్‌తో  డిఫరెంట్ మూవీ చేయవచ్చని ఆలోచించిన క్రిష్‌పై పొగడ్తల వర్షం
Pawan Chiru

Updated on: Mar 12, 2021 | 6:08 PM

Pawan Kalyan Krish Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ లో ఎన్నడూ లేనంత వరస సినిమాలను చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత పవన్ తిరిగి వెండి తెరపై వకీల్ సాబ్ తో రానున్నాడు.. ఇక తాజాగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యణ్ నటిస్తున్న సినిమా టీజర్ శివరాత్రి సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ ను చరిత్రక వీరుడు వజ్రాల దొంగగా చూపించారు. పవన్ ను హరిహర వీరమల్లుగా ఒక లుక్ లో ప్రేక్షకులకు ,అభిమానులకు పరిచయం చేశాడు క్రిష్. పవన్ లుక్ ను చూసి అందరు షాక్ అయ్యారు. ఈ టీజర్ తో ఇప్పటి వరకూ పవన్ లుక్ ను ఎవరూ ఊహించని విధంగా చూపించడంలో క్రిష్ సక్సెస్ అంటూ టాక్ వినిపిస్తోంది,
హరిహర వీరమల్లు టీజర్ పై సినీ ప్రముఖలు కూడా స్పందిస్తున్నారు. తాజా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తమ్ముడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ముందుగా ఇలాంటి డిఫరెంట్ సినిమాను పవన్ కళ్యణ్ తో చేయవచ్చు అని ఆలోచించిన దర్శకుడు క్రిష్ కు థాంక్స్ అని చెప్పారు. అంతేకాదు ఇప్పటి వరకూ భారత చలన చిత్ర చరిత్రలోనే ఎవరూ చేయని కథను తీసుకుని పవన్ తో చిత్రం తీసుకువస్తున్న చిత్ర యూనిట్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. హిస్టారికల్ మూవీగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు కు ఎంత చరిత్ర ఉందొ ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరికీ తెలుస్తుదందని చిరంజీవి చెప్పారట.

పవన్ కళ్యాన్ 27వ సినిమా క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. శివరాత్రి రోజున ఫస్ట్ లుక్ టీజర్, పేరును అనౌన్స్ చేసి చిత్ర యూనిట్ అభిమానులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. మరోవైపు మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనమ్ కోషియంకు రీమేక్.గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ తో పవన్ కళ్యణ్ బిజీగా ఉన్నారు.

Also Read:

హైదరాబాద్‌లో మత్యకన్య రూపంలో జన్మించిన శిశువు.. పుట్టిన రెండు గంటల్లోనే మృతి

గాంధీని టార్గెట్‌ చేసిన కంగనా, భార్య, సొంత బిడ్డలను వేధించినట్టు ఆరోపణలున్నాయని కామెంట్