తలైవాకు శుభాకాంక్షల వెల్లువ.. సోషల్ మీడియా కేంద్రంగా అభిమానాన్ని చాటుతున్న ప్రముఖులు..
ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ కలిగిన నటుడు సూపర్ స్టార్ రజినికాంత్. దక్షిణాదిన ఆయన పేరు చెబితే చాలు అభిమానులు ఆవేశంతో గంతులేస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ కలిగిన నటుడు సూపర్ స్టార్ రజినికాంత్. దక్షిణాదిన ఆయన పేరు చెబితే చాలు అభిమానులు ఆవేశంతో గంతులేస్తారు. తలైవా అంటూ కేకలేస్తారు. సినీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఆపాదించుకున్న హీరో రజినీకాంత్. తన వైవిధ్య మైన నటనతో, స్టైల్‌తో అభిమానులను అలరించడంలో ఆయనకు సాటిలేరు ఎవరు. అలాంటిది ఇవాళ రజినీకాంత్ పుట్టిన రోజు కావడంతో ప్రముఖుల నుంచి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.
మొదటగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రజినీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ అభినందనలు తెలిపారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించారు. “ప్రియమైన స్నేహితుడికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో అద్భుతమైన విజయాన్ని సాధించినట్లే రాజకీయాల్లోనూ విజయం సాధించాలి అని కోరుకున్నారు.సూపర్‌స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా రజినీకాంత్‌కు బర్త్ డే విషెష్ చెప్పారు. “రజనీకాంత్ సార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమాల్లోనూ, నిజ జీవితంలో మీరు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తారని భావిస్తున్నాను. మీకు శాంతి, సంతోషం, ఆనందం ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు. ఇంకా తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, అలాగే ఎ.ఆర్.రెహమాన్, డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్, డైరెక్టర్ బాబీ, రాధికా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్, మాస్ మహారాజా రవితేజ, ఖుష్బూ, డైరెక్టర్ శివ ఇలా అందరూ రజనీకాంత్‌కు బర్త్ డే విషెష్ అందించారు.