ఘనంగా టీఎస్సార్ టీవీ9 అవార్డ్స్ వేడుక

ఘనంగా టీఎస్సార్ టీవీ9 అవార్డ్స్ వేడుక

TSR టీవీ9 అవార్డ్స్ కు నేషనల్ వైడ్ గా ఓ గుర్తింపు ఉంది. ప్రతీ ఏడాది ఈ అవార్డుల ప్రధానోత్సవం వేడుక అట్టహాసంగా జరుగుతుంది. 2015-16 అవార్డుల ఫంక్షన్ కూడా కలర్ ఫుల్ గా సాగింది. విశాఖ వేదికగా ఈ వేడకకు తారాలోకం కదిలి వచ్చింది. అదిరిపోయే పాటలు, దుమ్మురేపే డ్యాన్స్ లతో అదరహో అనిపించింది. తారల హిట్ సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్పులేస్తూ డ్యాన్సర్లు అదరగొట్టారు. ప్రేక్షకుల విజిల్స్ తో విశాఖ స్టేడియంలో రీసౌండ్ వినిపించింది. […]

TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:57 PM

TSR టీవీ9 అవార్డ్స్ కు నేషనల్ వైడ్ గా ఓ గుర్తింపు ఉంది. ప్రతీ ఏడాది ఈ అవార్డుల ప్రధానోత్సవం వేడుక అట్టహాసంగా జరుగుతుంది. 2015-16 అవార్డుల ఫంక్షన్ కూడా కలర్ ఫుల్ గా సాగింది. విశాఖ వేదికగా ఈ వేడకకు తారాలోకం కదిలి వచ్చింది. అదిరిపోయే పాటలు, దుమ్మురేపే డ్యాన్స్ లతో అదరహో అనిపించింది. తారల హిట్ సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్పులేస్తూ డ్యాన్సర్లు అదరగొట్టారు. ప్రేక్షకుల విజిల్స్ తో విశాఖ స్టేడియంలో రీసౌండ్ వినిపించింది.
విశాఖ వేదికగా జరిగిన టీఎస్ఆర్ టీవీ9 అవార్డుల వేడుకలో కమెడీయన్ ఆలీ సండది చేశారు. ఎప్పుడు కామెడీతో కడుపుబ్బా నవ్వించే ఆలీ.. కాస్త డిఫరెంట్గా ట్రై చేశాడు. తనదైన డ్యాన్స్ లతో కేక పుట్టించాడు. ఇక ప్రముఖ పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలోనే ప్రతి ఏటా ఈ అవార్డుల వేడుక జరుగుతోంది. 201-16 అవార్డు వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ నుంచి అగ్రతారలంతా తరలివచ్చారు. కళారంగానికి టీఎస్సార్ చేస్తున్న సేవలను చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు లాంటి లెజండరీ నటులు కొనియాడారు.
2015-16 సంవత్సరానికి గాను సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకు అవార్డుల పంట పండింది. ఏకంగా నాలుగు అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ హీరోగా అల్లుఅర్జున్ అలాగే బెస్ట్ ఔట్ స్టాండింగ్ పర్ ఫామెన్స్ అవార్డును సైతం రుద్రమదేవి చిత్రానికి గాను స్టైలిష్ స్టార్ దక్కించుకున్నారు. ఉత్తమనటిగా శ్రీయ ఎంపికైతే.. ఉత్తమ హీరోయిన్ అవార్డు రకుల్ ప్రీత్ సింగ్ ఎగరేసుకుపోయింది. ఇక ఉత్తమ దర్శకుడిగా గుణశేఖర్, ఉత్తమ చిత్రంగా కంచె అవార్డులు దక్కించుకున్నాయి.
2016 ఏడాదికి గాను జెంటిల్ మెన్ చిత్రం నాలుగు అవార్డులు సొంతం చేసుకుంది. డిక్టేటర్ చిత్రానికి గాను బెస్ట్ హీరోగా బాలకృష్ణ, సోగ్గాడే చిన్నినాయన సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నాగార్జున అవార్డులు దక్కించుకున్నారు. బెస్ట్ ఫిల్మ్ గా ఉపిరి మూవీ సెలెక్ట్ అయింది. ఇక జ్యూరీ ఇచ్చే స్పెషల్ అవార్డుల్లో .. మిలీనియం స్టార్ అవార్డ్ శతృఘ్న సిన్ హాకు దక్కింది. 4 డికేట్స్ స్టార్ అవార్డు మోహన్ బాబు సొంతం చేసుకున్నారు. లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు బప్పీలహరికి దక్కింది.
జ్యూరీ స్పెషల్ అవార్డుల్లో నేషనల్ స్టార్ అవార్డు ప్రభాస్ సొంత చేసుకున్నాడు. బెస్ట్ పర్ఫామెన్స్ రానా, మాస్ ఎంటర్ టైనర్ కళ్యాణ్ రామ్, ఉత్తమ నటి మంచు లక్ష్మీ, ఉత్తమ కథానాయిక హెబ్బాపటేల్, ఉత్తమ దర్శకుడు క్రిష్, ఉత్తమ సంగీత దర్శకుడు మణిశర్మ, ఉత్తమ గాయకుడిగా సింహా అవార్డులు దక్కించుకున్నారు. అలాగే.. బెస్ట్ తమిళ్ యాక్టర్ గా మాధవన్, ఉత్తమ తమిళ నటి హన్సిక, ఉత్తమ కన్నడ నటి ప్రియమణి, ఉత్తమ కన్నడ నటుడిగా నిఖిల్ గౌడను అవార్డులు వరించాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu