AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నా ఇది నువ్వేనా..! మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో

సునీల్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘మర్యాద రామన్న’. 2010లో విడుదలైన ఈ ఫ్యామిలీ కామెడీ యాక్షన్ డ్రామా లో సలోని హీరోయిన్ గా నటించింది. అలాగే నాగినీడు, సుప్రీత్, ప్రభాకర్, బ్రహ్మాజీ, రావు రమేష్, చత్రపతి శేఖర్.. ఇలా భారీ తారగణం ఇందులో కనిపించింది.

అన్నా ఇది నువ్వేనా..! మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో
Hero
Rajeev Rayala
|

Updated on: Nov 16, 2026 | 11:48 AM

Share

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన క్లాసిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మర్యాద రామన్న’. 2010లో విడుదలైన ఈ చిత్రంలో సునీల్ హీరోగా, సలోని హీరోయిన్‌గా నటించారు. నాగినీడు, సుప్రీత్, ప్రభాకర్, బ్రహ్మాజీ, రావు రమేష్ వంటి భారీ తారాగణంతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా, వినోదాత్మకంగా సాగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.  అయితే, ఈ సినిమాలో సునీల్‌కు నాగినీడు ఇంటికి దారిచూపే ‘ఓబులేశ్’ అనే రాయలసీమ కుర్రాడి పాత్రలో ఓ యువ నటుడు మెరిశాడు. పైన ఉన్న ఫొటోలో సునీల్ పక్కనే కనిపిస్తున్న ఆ కుర్రాడు మరెవరో కాదు.. ప్రస్తుతం టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు శ్రీ సింహా కోడూరి. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి తనయుడిగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, శ్రీ సింహా తన ప్రతిభతోనే మెట్లు ఎక్కుతూ వచ్చాడు.

నిండుగా జీవించలేకపోతున్నా.. నవ్వలేకపోతున్నా..! మా మధ్యలో ఎవ్వరూ రాలేదు.. కానీ విడిపోయాం

విక్రమార్కుడు సినిమాలో మార్వాడీ పెళ్లి ఇంట్లో అల్లరి చేసే పిల్లల్లో ఒకరిగా కనిపించిన శ్రీ సింహా, ఆ తర్వాత ఎన్టీఆర్ ‘యమదొంగ’ చిత్రంలో   జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించాడు. ఆ తర్వాతే ‘మర్యాద రామన్న’లో ఓబులేశ్ పాత్రలో తళుక్కుమన్నాడు. అప్పట్లో అతడిని ఎవరూ అంతగా గుర్తుపట్టకపోయినా, ఇప్పుడు ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మత్తు వదలరా చిత్రంతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఆ పాట పాడేటప్పుడు భయమేసింది.. ఎవరైనా వచ్చి తిడతారేమో అనిపించింది: గీత మాధురి

ఆ తర్వాత తెల్లవారితే గురువారం, ఉస్తాద్, భాగ్ సాలే వంటి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను పలకరించాడు. కెరీర్ పరంగా ‘మత్తు వదలరా 2’తో మరో భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న శ్రీ సింహా, వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. సీనియర్ నటుడు మురళి మోహన్ మనవరాలు రాగ మాగంటిని వివాహం చేసుకుని, వారి ఇంటి అల్లుడిగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. త్వరలోనే తిరిగి సినిమాలు మొదలుపెట్టనున్నాడు సింహ.

నా గురించి ఆ హీరోకి తప్పుగా చెప్పారు.. ఇంటికి వెళ్లి మాట్లాడితే ఆయన రియాక్ట్ అయ్యారంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?
నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?