AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Bandi Bride: బుల్లెట్‌ బండి పెళ్లి కూతురుకి ఆఫర్లు కూడా మొదలయ్యాయిగా.. సాయి శ్రియ ప్రధాన పాత్రలో.

Bullet Bandi Bride: సోషల్‌ మీడియా ఎప్పుడు ఎవరినీ ఎలా పాపులర్‌ చేస్తుందో ఎవరికీ తెలియదు. ఈ మధ్య కాలంలో ఏ వార్తా ఛానెల్‌ను చూసినా.. ఏ సోషల్‌ మీడియా సైట్‌ను చూసినా.. 'బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా' అనే పాట...

Bullet Bandi Bride: బుల్లెట్‌ బండి పెళ్లి కూతురుకి ఆఫర్లు కూడా మొదలయ్యాయిగా.. సాయి శ్రియ ప్రధాన పాత్రలో.
Bullet Bandi Sai Shriya
Narender Vaitla
|

Updated on: Aug 25, 2021 | 11:18 AM

Share

Bullet Bandi Bride: సోషల్‌ మీడియా ఎప్పుడు ఎవరినీ ఎలా పాపులర్‌ చేస్తుందో ఎవరికీ తెలియదు. ఈ మధ్య కాలంలో ఏ వార్తా ఛానెల్‌ను చూసినా.. ఏ సోషల్‌ మీడియా సైట్‌ను చూసినా.. ‘బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా’ అనే పాట హంగామా చేస్తోంది. పెళ్లి బరాత్‌లో పెళ్లి కూతురు ఈ పాటకు వేసిన స్టెప్పులు సోషల్‌ మీడియాను ఒక్కసారిగా షేక్‌ చేశాయి. పెళ్లి కూతురు ఎక్స్‌ప్రెషన్స్‌ నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా ట్రెండింగ్‌లో నిలిచింది. మంచిర్యాల జిల్లా జిన్నారంకు చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్ ఓ రాము, సురేఖ దంపతుల కుమార్తె సాయి శ్రియను రామకృష్ణాపూర్ కు చెందిన ఆకుల అశోక్ తో ఈనెల 14వ తేదీన పెళ్లి జరిగింది. ఈ సమయంలో పెళ్లి అనంతరం జరిగిన బరాత్‌లో సాయి శ్రియ చేసిన డ్యాన్స్‌ వైరల్‌గా మారింది.

దీంతో శ్రియకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ జంట బయట కనిపిస్తే జనాలు ఎగడబే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి శ్రియకు మరో అనుకోని ఆఫర్‌ లభించింది. బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తాపా అనే జానపద పాటను రూపొందించిన ‘బ్లూ రాబిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ సాయి శ్రియకు తమ తర్వాతి పాటలో అవకాశం ఇచ్చారు. వీరు రూపొందించనున్న పాటలో శ్రియను లీడ్‌ రోల్‌లో నటించాలని కోరారు. బ్లూ రాబిట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్వాహకులు నిరూప.. సాయి శ్రియతో ఫోన్‌లో మాట్లాడి ఈ విషయాన్ని తెలిపారు. దీంతో సాయి శ్రియ సంతోషం వ్యక్తం చేస్తూ.. పాటలో నటించడానికి ఓకే చెప్పేశారు. మరి బుల్లెట్‌ బండి పాటతో ఆకట్టుకున్న ఈ కొత్త పెళ్లి కూతురు ఇంకెన్ని వండర్స్‌ చేస్తుందో చూడాలి.

Also Read: Thalaivi Movie : ఆకట్టుకుంటున్న తలైవి రొమాంటిక్ పోస్టర్.. జయలలిత-ఎంజీఆర్ అప్పట్లో ఇలా..

Bell Bottom : అక్షయ్ కుమార్ సినిమాకు ఊహించని రిజల్ట్.. ఆలోచనలో పడ్డ బాలీవుడ్ బడా సినిమాలు..

Nandamuri Balakrishna: నటసింహం కోసం పవర్ఫుల్ విలన్‌ను వెతికే పనిలో గోపీచంద్ మలినేని..