Shah Rukh Khan: కింగ్ ఖాన్ కోసం రంగంలోకి దిగిన దళపతి విజయ్..

|

Aug 27, 2022 | 9:25 PM

బాలీవుడ్‌ కింగ్ ఖాన్‌ షారూఖ్‌ ఖాన్‌ సౌత్ డైరెక్టర్‌తో ఓ సినిమా చేస్తున్నారు. కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అట్లీ డైరెక్షన్‌లో జవాన్ సినిమా చేస్తున్నారు షారూఖ్‌.

Shah Rukh Khan: కింగ్ ఖాన్ కోసం రంగంలోకి దిగిన దళపతి విజయ్..
Shahrukh Khan
Follow us on

బాలీవుడ్‌ కింగ్ ఖాన్‌ షారూఖ్‌ ఖాన్‌(Shah Rukh Khan)సౌత్ డైరెక్టర్‌తో ఓ సినిమా చేస్తున్నారు. కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అట్లీ డైరెక్షన్‌లో జవాన్ సినిమా చేస్తున్నారు షారూఖ్‌. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ సర్‌ప్రైజింగ్ న్యూస్‌ సౌత్‌ సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. షారూఖ్‌ ఖాన్‌కు ఫస్ట్ నుంచి సౌత్ సినిమాతో మంచి రాపోనే ఉంది. కంప్లీట్‌ సౌత్‌ ఫ్లేవర్‌తో చేసిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌ బాద్‌షా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలిచింది. ఆ తరువాత షారూఖ్ ఎంతో ఇష్టపడి చేసిన రావన్‌ సినిమాలో సౌత్ సూపర్ స్టార్‌ రజనీకాంత్ గెస్ట్‌ రోల్‌లో కనిపించారు. ఇప్పుడు అదే ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తూ ఓ సౌత్‌ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నారు షారూఖ్‌.

దళపతి విజయ్‌ హీరోగా వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అట్లీ దర్శకత్వంలో షారూఖ్‌ చేస్తున్న సినిమా జవాన్. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. కంప్లీట్‌గా సౌత్ ఫ్లేవర్‌తో రూపొందుతున్న ఈ సినిమా మీద భారీ ఆశాలు పెట్టుకున్నారు కింగ్ ఖాన్‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా జవాన్‌లో షారూఖ్‌తో పాటు కోలీవుడ్ టాప్ హీరో విజయ్‌ కూడా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ సినిమాలో విజయ్ గెస్ట్‌ రోల్‌ చేస్తున్న న్యూస్‌ నేషనల్‌ లెవల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నార్త్‌ సూపర్‌ స్టార్‌, సౌత్ టాప్ హీరో కలిసి నటిస్తుండటంతో ఈ కాంబో ఆడియన్స్‌కు ఐ ఫీస్ట్ అంటున్నారు క్రిటిక్స్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.