Ameesha Patel: మళ్ళీ సమస్యల్లో అమీషా పటేల్.. చెక్ బౌన్స్ కేసులో రాంచీ కోర్టు వారెంట్ జారీ..

మొదటి సినిమాతోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అమీషా అనేక సూపర్ హిట్ సినిమాతో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది.  తర్వాత రేసు లో వెనకబడింది. గత కొంతకాలంగా అమీషాను పలు వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా అమీషా పటేల్ మరోసారి చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి వార్తల్లోకి వచ్చింది.

Ameesha Patel: మళ్ళీ సమస్యల్లో అమీషా పటేల్.. చెక్ బౌన్స్ కేసులో రాంచీ కోర్టు వారెంట్ జారీ..
Ameesha Patel

Updated on: Apr 07, 2023 | 12:22 PM

కహో నా ప్యార్ హై సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన బ్యూటీ అమీషా పటేల్. టాలీవుడ్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అమీషా అనేక సూపర్ హిట్ సినిమాతో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది.  తర్వాత రేసు లో వెనకబడింది. గత కొంతకాలంగా అమీషాను పలు వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా అమీషా పటేల్ మరోసారి చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి వార్తల్లోకి వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం..  రాంచీలోని కోర్టు అమీషా పటేల్ తో పాటు, ఆమె వ్యాపార భాగస్వామి కునాల్‌కు వారెంట్ జారీ చేసింది.

ఈ కేసు 2018 సంవత్సరానికి సంబంధించినది. అమీషా పటేల్ ..  ఆమె వ్యాపార భాగస్వామి కునాల్‌పై అజయ్ కుమార్ సింగ్ అనే నిర్మాత సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు అమీషా, కునాల్ పై మోసం, బెదిరింపు,యు చెక్ బౌన్స్ లపై ఫిర్యాదు చేశారు.కేసు కోర్టు మెట్లు ఎక్కింది. అయితే విచారణ సమయంలో అమీషా పటేల్ కానీ ఆమె తరపు లాయర్ గానీ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో  అమీషా పటేల్ తో పాటు కునాల్‌కు రాంచీ కోర్టు వారెంట్ జారీ చేసింది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 15 కు వాయిదా వేసింది.

అసలు విషయంలోకి వెళ్తే.. ?

ఇవి కూడా చదవండి

‘దేశీ మ్యాజిక్’ అనే సినిమా మేకింగ్, పబ్లిసిటీ కోసం అమీషా పటేల్ .. ఆమె భాగస్వామి కునాల్ తన నుండి రూ. 2.5 కోట్లు తీసుకున్నారని అజయ్ కుమార్ సింగ్ ఆరోపించాడు. చిత్ర పూర్తి అయ్యాక తిరిగి ఇస్తామని ఆ సమయంలో అమీష చెప్పిందని తెలిపారు. ‘దేశీ మ్యాజిక్’ సినిమా షూటింగ్  2013లో మొదలైంది.. అయితే ఇప్పటికీ ఆ సినిమా సినిమా విడుదల కాలేదని అజయ్ కుమార్ పేర్కొన్నారు.

తర్వాత అజయ్ కుమార్ తన డబ్బును అమీషా పటేల్‌ను అడగగా, దానిని ఇవ్వడానికి నటి నిరాకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. చివరకు 2018లో అజయ్ కుమార్ కు నటి అమీషా రూ.2.5 కోట్ల 50 లక్షల కు గాను రెండు చెక్కులు ఇచ్చింది. అయితే అవి బౌన్స్ అయ్యాయి. దీంతో అజయ్ చెక్ బౌన్స్ కేసుతో పాటు తనను డబ్బులు అడిగినందుకు బెదిరిస్తోంది అంటూ ఫిర్యాదు చేశాడు.

గదర్ 2లో కనిపించనున్న అమీషా  

అమీషా పటేల్ నటించిన గదర్ 2  చాలా కాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి, ఇది 2001లో విడుదలైన గదర్: ఏక్ ప్రేమ్ కథా చిత్రానికి సీక్వెల్. ఇందులో సన్నీ డియోల్ సరసన అమీషా నటిస్తుంది. ఈ సినిమా ఆగస్ట్ 11 2023న విడుదల కానుంది.

 

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..