అలాంటి సినిమాలు చేయడం నావల్ల కాదు.. మనసులో మాట బయటపెట్టిన బాలీవుడ్ బ్యూటీ..

సిల్క్ స్మిత జీవిత ఆధారంగా నిర్మించిన 'ద డర్టీ ఫిక్చర్' సినిమాలో హీరోయిన్‌గా నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు

అలాంటి సినిమాలు చేయడం నావల్ల కాదు.. మనసులో మాట బయటపెట్టిన బాలీవుడ్ బ్యూటీ..
Follow us

|

Updated on: Dec 02, 2020 | 5:12 AM

సిల్క్ స్మిత జీవిత ఆధారంగా నిర్మించిన ‘ద డర్టీ ఫిక్చర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు బాలీవుడ్ నటి విద్యాబాలన్. ఇటీవల ఆమె నటించిన ‘నట్‌ఖట్’ జాతీయ ఉత్తమ లఘుచిత్రంగా నిలిచి ఆస్కార్‌కు కూడా నామినేట్ అయింది. అయితే తాజాగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి.

మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో చేయడం తన బాధ్యత కాదని ఒక్కసారిగా ప్రకటించింది. దీంతో అందరూ షాక్ గురయ్యారు. ఎందుకంటే విద్యాబాలను చేసిన సినిమాలన్నీ మహిళా ప్రాధాన్యమున్న సినిమాలే. అంతేకాకుండా ఆ సినిమాలతోనే ఆమెకు చాలా గుర్తింపు వచ్చింది. అందుకే ఏకంగా ఇండియన్ గవర్న్‌మెంట్ 2014లో పద్మశ్రీతో సత్కరించింది. మహిళల స్థితిగతులను, వారి కష్టాలను చూపించడం తన బాధ్యత కాదని, కాని వారి జీవితాలను ప్రేరణగా తీసుకొని కథలను ఎంచుకుంటాని వెల్లడించారు. గొప్ప గొప్ప మహిళా జీవితాలు తనను ఎంతో ప్రభావితం చేశాయని అందుకే వారినుంచి తను ప్రేరణ పొందుతానని చెప్పింది. అంతేకాకుండా స్టోరీ న్యాచురల‌్‌గా ఉంటే ఏ సినిమాలోనైనా నటిస్తానని తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. తనపై ప్రజలు చూపించే అభిమానానికి ఎల్లప్పుడు తాను బానిసనేనని చెప్పుకొచ్చింది. వార ఆశీర్వాదం ఉంటే భవిష్యత్‌లో ఎన్నో మంచి సినిమాలు చేస్తానని తెలిపింది.