
ప్రస్తుతం సినిమాల్లో పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్.. ఇలా అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ ఈ భారీ సినిమాలకే ఓటు వేస్తున్నాయి. వీఎఫ్ఎక్స్ హంగులు, అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్సుల అంటూ కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. అయితే వీటిలోనూ కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. మరికొన్ని మూవీస్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఫలితంగా నిర్మాతలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి ట్రెండ్ లో ఒక చిన్న సినిమా అద్బుతాలు చేస్తోంది. ఇందులో స్టార్ హీరో, హీరోయిన్స్ లేరు. బడ్జెట్ కూడా పెద్దగా పెట్టలేదు. వీఎఫ్‌ఎక్స్, స్పెషల్ సాంగులు, యాక్షన్ సీక్వెన్సులు గట్రా ఏమీ లేవు. ప్రమోషన్స్ కూడా చేయలేదు. అసలు ఈ సినిమా రిలీజ్ గురించే చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. రోజూ కోట్లాది రూపాయలను కలెక్ట్ చేస్తూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మూవీ పేరే వినిపిస్తోంది. నేషనల్ మీడియాలోనూ ఈ సినిమాకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి.
పాన్ ఇండియా ట్రెండ్ అంటూ ప్రస్తుతం సినిమాల్లో భారీ తనానికే పెద్ద పీటవేస్తున్న పరిస్థితుల్లోనూ కంటెంటే కింగ్ అని మరోసారి నిరూపించిన ఆ సినిమా పేరు సైయారా. మోహిత్ సూరి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో అహాన్ పాండే (అనన్యా పాండే సోదరుడు), అనీత్ పడ్డా హీరో, హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరికీ ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. ఈ సినిమా కథ కూడా సింపుల్ గా ఉంటుంది. హీరో, హీరోయిన్ ప్రేమలో పడతారు. కొన్ని సంఘటనల కారణంగా హీరోయిన్ గతం మర్చిపోతుంది. కొత్తగా ఇంకొకరిని ప్రేమించడంతో కథ లో ట్విస్ట్ ఆసక్తి రేపుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? హీరో, హీరోయిన్లు కలిశారా? అన్నదే ఈ సినిమా కథ.
#Saiyaara is touching hearts everywhere… ❤️ 💥 ✨
Watch #Saiyaara today! Book tickets now – https://t.co/VPBDTKunDq | https://t.co/SMKkZcVFYf…#AhaanPanday | #AneetPadda | @mohit11481 | #AkshayeWidhani pic.twitter.com/ekGvBY2IVl— Yash Raj Films (@yrf) July 29, 2025
గతంలో ఇదే కథతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఆషికీ 2 వంటి ఎమోషనల్ లవ్ స్టోరీలు తీసిన డైరెక్టర్ మోహిత్ సూరి తన ప్రజెంటేషన్ తో ఈ మూవీలోనూ మ్యాజిక్ చేశాడు. ప్రతి సీన్ కొత్తగా ఉండటం, ఫీల్ గుడ్ మూడ్ కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే జులై 18న రిలీజైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.404 కోట్ల కలెక్షన్లు సాధించింది.
Experience a love story you’ll never forget 💘
Watch #Saiyaara in theatres now!Book your tickets – https://t.co/T2QGBqhgqR | https://t.co/9iUzCKkHaY #AhaanPanday | #AneetPadda | @mohit11481 | #AkshayeWidhani pic.twitter.com/OA5y7FdPSe
— Yash Raj Films (@yrf) July 29, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.