Vivek Agnihotri: షారుఖ్, సల్మాన్‏లపై కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. వారు ఉన్నంతకాలం బాలీవుడ్ మునిగిపోతుందంటూ..

|

Jul 16, 2022 | 12:10 PM

ఓ ఆంగ్లపత్రికలో వచ్చిన "షారుఖ్ ఖాన్ ఇప్పటికీ ఎందుకు బాలీవుడ్‏కు కింగ్" అనే కథనంపై స్పందిస్తూ వివేక్ ఈ ట్వీట్ చేశారు.

Vivek Agnihotri: షారుఖ్, సల్మాన్‏లపై కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. వారు ఉన్నంతకాలం బాలీవుడ్ మునిగిపోతుందంటూ..
Vivek Agnihotri
Follow us on

బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తన ట్విట్టర్ వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు. అందులో స్టార్ హీరోస్ పేర్లను ప్రస్తావించకుండానే పరోక్షంగా విమర్శిస్తూ పోస్ట్ పెట్టారంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ ఆంగ్లపత్రికలో వచ్చిన “షారుఖ్ ఖాన్ ఇప్పటికీ ఎందుకు బాలీవుడ్‏కు కింగ్” అనే కథనంపై స్పందిస్తూ వివేక్ ఈ ట్వీట్ చేశారు.

” బాలీవుడ్‏లో రాజులు, బాద్ షాలు, సుల్తానులు ఉన్నంతకాలం ఇండస్ట్రీ మునగిపోతూనే ఉంటుంది. ప్రజల కథలతో సినిమాలను తెరకెక్కించండి. బాలీవుడ్ ను ప్రజల పరిశ్రమగా మార్చండి. అప్పుడు ఇండస్ట్రీ ప్రపంచ చలనచిత్ర పరిశ్రమగా అభివృద్ధి చెందుతుంది. ఇదే వాస్తవం” అంటూ ట్వీట్ చేశారు. దీంతో బాలీవుడ్ స్టార్స్ షారుఖ్, సల్మాన్ లను ఉద్దేశించే వివేక్ ఈ ట్వీట్ చేశారంటూ నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

అయితే వివేక్ చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీకెందుకు అంత అహం.. మీరు నిజంగానే అహంబావి.. షారుఖ్, సల్మాన్ కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఎన్నో ఏళ్ల పలితంగా ప్రజల ప్రేమాభిమానంతో వారు బాద్ షా, సుల్తాన్, కింగ్స్ అయ్యారు. వారిని ఇప్పటికీ ప్రజలు ప్రేమిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం వివేక్ కామెంట్లకు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి డైరెక్టర్ వివేక్ చేసిన ట్వీట్ మాత్రం ఇప్పుడు బీటౌన్‏లో హాట్ టాపిక్‏గా మారింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.