The Kashmir Files: 300 కోట్ల క్లబ్‌లో చేరిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’.. ప్రశంసలు కురిపిస్తున్న ప్రముఖులు..!

|

Mar 31, 2022 | 11:14 AM

The Kashmir Files: వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ' ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. మూడో వారం ముగిసే సమయానికి 300 కోట్ల క్లబ్‌లో చేరింది.

The Kashmir Files: 300 కోట్ల క్లబ్‌లో చేరిన ది కాశ్మీర్ ఫైల్స్.. ప్రశంసలు కురిపిస్తున్న ప్రముఖులు..!
The Kashmir Files
Follow us on

The Kashmir Files: వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. మూడో వారం ముగిసే సమయానికి 300 కోట్ల క్లబ్‌లో చేరింది. రోజు రోజుకి ఈ సినిమా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. థియేటర్ల వద్ద ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఒకవైపు ఎస్ఎస్ రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ సందడి చేస్తుండగా మరోవైపు రిషి కపూర్ చిత్రం ‘ శర్మాజీ నమ్కీన్’ కూడా థియేటర్లలోకి వచ్చింది. గట్టి పోటీ ఉన్నప్పటికీ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ థియేటర్లలో నిలదొక్కుకోవడం విశేషం. కశ్మీర్ ఫైల్స్ ఇప్పుడు మరో రికార్డు సృష్టించింది. కలెక్షన్ల పరంగా బాలీవుడ్ నటుల చిత్రాలను బీట్ చేస్తోంది. యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సూర్యవంశీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ది కాశ్మీర్ ఫైల్స్ ఈ సినిమాని బీట్ చేసింది.

300 కోట్ల క్లబ్‌లో చేరిన ది కాశ్మీర్ ఫైల్స్

ది కాశ్మీర్ ఫైల్స్ అంతర్జాతీయ కలెక్షన్లలో 300 కోట్లు దాటింది. దీంతో సూర్యవంశీ సినిమా క్రియేట్‌ చేసిన ప్రపంచవ్యాప్త రికార్డును బద్దలు కొట్టింది. అక్షయ్ కుమార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.294.17 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం.. వివేక్ అగ్నిహోత్రి చిత్రం గ్రాస్ కలెక్షన్ రూ.301.01 కోట్లు. ఈ జాబితాలో చేరిన 32వ చిత్రంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నిలిచింది.

కాశ్మీర్ పండిట్లపై ఊచకోత, ఉగ్రవాదుల చర్యలతో ఆ రాష్ట్రం నుంచి వలస వెళ్లిన పండిట్ల వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. భారత్ లో అంతర్భాగమైన కాశ్మీర్ లో పండిట్లపై జరిగిన దారుణ ఘటనలు హిందూ మతాన్ని అణిచివేసేందుకు ఉగ్రవాదులు చేపట్టిన అమానవీయ చర్యలుగా అభివర్ణిస్తూ, దేశ ప్రజలకు నిజాలు తెలిసేలా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 11న విడుదలైన ఈచిత్రం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విజవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇక దేశంలోని అన్ని వర్గాలతో పాటు..సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఈ చిత్రంపై ప్రసంశలు కురిపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ చిత్రానికి పన్ను మినహాయింపు కూడా ప్రకటించారు. ప్రధాని మోదీ సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. దేశంలోని ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రమని ముఖ్యంగా యువత ఈ చిత్రాన్ని చూసి నిజానిజాలను తెలుసుకోవాలని ప్రధాని మోదీ అన్నారు.

Agriculture News: మొక్కజొన్నకి ధర పెరగడంతో నూకలకి పెరిగిన డిమాండ్‌.. క్వింటాల్‌ ధర ఎంతంటే..?

ECLGS: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌ 5 లక్షల కోట్లకు పెంపు..!

ఉద్యోగులకి శుభవార్త.. రోజుకి 12 గంటల పని.. మూడు రోజులు సెలవులు..?