ప్రముఖ టీవీ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఝలక్ దిఖ్లా జా’ తర్వాత భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఫేట్ పూర్తిగా మారిపోయింది. తన డ్యాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ధనశ్రీ త్వరలో జియో సినిమా రియాల్టీ షో ‘బిగ్ బాస్ OTT’ సీజన్ 3లోకి ప్రవేశించవచ్చు. నిజం చెప్పాలంటే ఇంతకు ముందు కూడా ధనశ్రీకి సల్మాన్ ఖాన్ రియాలిటీ షోలో ఆఫర్ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల హౌజ్‌లోకి వెళ్లలేకపోయింది. ఇప్పుడు మరోసారి షో కోసం బిగ్ బాస్ టీమ్ ఆమెను సంప్రదించింది. ధనశ్రీ సోనీ టీవీ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఝలక్ దిఖ్లా జా’లో ‘వైల్డ్ కార్డ్’ కంటెస్టెంట్‌గా ప్రవేశించింది. ఆమె హుషారెత్తించిన డ్యాన్స్ లకు జడ్జిలతో పాటు ఎంతో మంది అభిమానులు ఫిదా అయ్యారు. శివ థాకరే, రామ్ చంద్ర వంటి వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లను కాదని ధనశ్రీ ఈ షోలో టాప్ 3లో తన స్థానాన్ని సంపాదించుకోవడానికి ఇదే కారణం. ధనశ్రీ ప్రయాణంలో భారత క్రికెట్ జట్టు సభ్యులు కూడా ముఖ్య పాత్ర పోషించారు. షో గ్రాండ్ ఫినాలేలో భారత క్రికెట్ జట్టులోని పలువురు ఆటగాళ్లు ధనశ్రీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
కాగా ధనశ్రీ బిగ్ బాస్ హౌజ్ లోకి వస్తే క్రికెట్ అభిమానులు కూడా తమ షో వైపు ఆకర్షితులవుతారని బిగ్ బాస్ టీమ్ కోరుకుంటోంది. అయితే చాహల్ భార్య బిగ్ బాస్ హౌజ్ ఎంట్రీపై ఇప్పటి వరకు ధనశ్రీ కానీ, జియో సినిమా కానీ అధికారిక ప్రకటన వెలువరించలేదు. ఐపీఎల్ తర్వాత ‘ బిగ్ బాస్ OTT ‘ సీజన్ 3 జూన్‌లో ప్రారంభం కానుంది. విక్కీ జైన్, మాక్స్‌టర్న్, థాగేష్, షాజాదా ధామి, ప్రతీక్షా హోన్ముఖే, శ్రీరామ్ చంద్ర, షీజాన్ ఖాన్, అర్హాన్ బెహ్ల్ వంటి చాలా మంది కంటెస్టెంట్లు షోలో చేరమని బిగ్ బాస్ బృందం సంప్రదించింది. వీరిలో ఎంతమంది ఈ షోలో పాల్గొనేందుకు అంగీకరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా ఫేమస్ యూట్యూబర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ధన శ్రీ వర్మ. ఆమె డ్యాన్స్ లకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ ఉంది. గతంలో పలువురు భారత క్రికెటర్లతో కలిసి స్టెప్పులేసిందీ అందాల తార.
varun and dhanashree ?! my brand omg i always wanted a dance reel with them, also i changed the song and this one fits so well i love it 🥳❤️ #VarunDhawan | #DhanashreeVerma pic.twitter.com/SgdnxN84u3
— Annesha (@ApnaaVarun) April 13, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.