Suriya : బాలీవుడ్‌లోకి సూర్య సూపర్ హిట్ మూవీ.. హీరోగా స్టార్ హీరో అక్షయ్ కుమార్

| Edited By: Ravi Kiran

Apr 26, 2022 | 12:25 PM

స్టార్ హీరో సూర్య ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూర్య ఆమధ్య సరైన హిట్ లేక సతమతం అయ్యారు. ఆ సమయంలో విడుదలైన సినిమాలన్నీ వరుసగా ప్రేక్షకులను నిరాశ పరిచాయి.

Suriya : బాలీవుడ్‌లోకి సూర్య సూపర్ హిట్ మూవీ.. హీరోగా స్టార్ హీరో అక్షయ్ కుమార్
Akshay Kumar ,surya
Follow us on

స్టార్ హీరో సూర్య(Suriya )ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూర్య ఆమధ్య సరైన హిట్ లేక సతమతం అయ్యారు. ఆ సమయంలో విడుదలైన సినిమాలన్నీ వరుసగా ప్రేక్షకులను నిరాశ పరిచాయి. అదే టైం లో సుధ కొంగరు దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీహద్దు రా సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. కరోనా కారణంగా థియేటర్స్‌లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ మూవీ సూపర్ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. కెప్టెన్ గోపినాథ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆకాశం నీ హద్దురా సినిమా తిరిగి సూర్యను సక్సెస్ ట్రాక్‌‌‌‌‌లోకి తీసుకువచ్చింది. ఈమూవీలో సూర్య సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్‌‌‌‌గా నటించింది. సిఖ్య ఎంటర్టైన్మెంట్స్ మరియు 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై భారీ హిట్ అందుకున్న మొదటి సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది.

”ఆకాశం నీ హద్దురా” చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ – రాధిక మదన్ ప్రధాన పాత్రల్లో సుధా కొంగర ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. కొత్త సినిమా షూటింగ్ ను మొదలుపెట్టామని.. దీనికి మంచి టైటిల్ ను సూచించమని ఫ్యాన్స్ ను సోషల్ మీడియా వేదిక రిక్వెస్ట్ చేశారు అక్షయ్ కుమార్. ఈ హిందీ రీమేక్ ను సూర్య – జ్యోతిక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత విక్రమ్ మల్హోత్రా కు చెందిన అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ మరియు అక్షయ్ కుమార్ కేఫ్ ఆఫ్ గుడ్ హోప్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Raveena Tandon: స్ట‌న్నింగ్ పోజుల‌తో ర‌చ్చ చేస్తున్న రవీనా టాండన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Srinidhi Shetty: అందాలతో కవ్విస్తున్న కేజీయఫ్‌ భామ.. వైరల్ అవుతున్న శ్రీనిధి శెట్టి లేటెస్ట్ ఫోటోస్

Viral Photo: ఆమె మాటలు గంగా ప్రవాహం.. ఆమె అందం యువకులను ఆకర్షించే మకరందం.. గుర్తించారా..?