Sunny Leone: ప్రస్తుతం సన్నీలియోన్ సినిమాల నుంచి తప్పుకుంది. ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే సన్నిలియోన్ బాలీవుడ్‌కి రావడం చాలా మందికి ఇష్టంలేదు. అయినప్పటికీ సన్నీ బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది. ప్రస్తతం ఆమె మ్యూజిక్ వీడియోలు చేస్తుంది. తాజాగా కనికా కపూర్ పాడిన ఓ పాటలో సన్నీ కనిపించింది. ఈ పాటను బుధవారం విడుదల చేశారు. ఈ పాట విడుదలైనప్పటి నుంచి వివాదంలో చిక్కుకుంది. సోషల్ మీడియాలో ఈ పాటపై జనాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఈ పాటలో సన్నీలియోన్ మరోసారి తన బోల్డ్ స్టైల్‌ని చూపించింది. పాట విడుదలై 24 గంటలు కాకముందే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. ఈ పాటను షరీబ్, తోషి స్వరపరిచారు. ఈ పాటను సన్నీ లియోన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అనంతరం ఈ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. సన్నీలియోన్ క్షమాపణలు చెప్పాలని కొందరు డిమాండ్ చేస్తుండగా మరికొంతమంది ఈ పాటను బ్యాన్ చేయాలని వాదిస్తున్నారు.
ఇది అర్ధంలేని పని అని హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నమని ఓ యూజర్ సోషల్ మీడియాలో రాశారు! రాధ నర్తకి కాదు, భక్తురాలు. మధుబన్ పవిత్ర ప్రదేశం. రాధ మధుబన్‌లో ఇలా డ్యాన్స్ చేయలేదు. ఇది సిగ్గుపడే సాహిత్యం అని మండిపడ్డారు. దేవుడిని కించపరిచే హక్కు నీకు లేదని మరొక వినియోగదారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చే డబ్బుతోనే మీరు విలాసాలు అనుభవిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ పాటను తొలగించి పాట సాహిత్యాన్ని మార్చండని హెచ్చరించారు.
Radha is not dancer she is a devotee…madhuban is a noble place madhuban mein radha aise dance nahi karti …shameful lyrics????????
— SHUBHAMINDIA@1727 (@SHUBHAM17271) December 22, 2021