Sudha Murty: ‘హార్ట్‌ టచింగ్‌’.. ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ సినిమాను చూసిన సుధా మూర్తి ఏమన్నారో తెలుసా?

|

Sep 19, 2023 | 6:24 PM

ది కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి. కశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.200 కోట్లు రాబట్టింది. అదే సమయంలో ఎన్నో వివాదాలు కూడా సృష్టించింది. పలువురు ప్రముఖులు ఈ సినిమాపై విమర్శలు చేశారు. ఇలా కశ్మీర్ ఫైల్స్‌ తో నేషనల్‌ వైడ్‌ గా పాపులారిటీ సొంతం చేసుకున్న వివేక్‌ అగ్ని హోత్రి

Sudha Murty: హార్ట్‌ టచింగ్‌.. ది వ్యాక్సిన్‌ వార్‌ సినిమాను చూసిన సుధా మూర్తి ఏమన్నారో తెలుసా?
Sudha Murthy
Follow us on

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి. కశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.200 కోట్లు రాబట్టింది. అదే సమయంలో ఎన్నో వివాదాలు కూడా సృష్టించింది. పలువురు ప్రముఖులు ఈ సినిమాపై విమర్శలు చేశారు. ఇలా కశ్మీర్ ఫైల్స్‌ తో నేషనల్‌ వైడ్‌ గా పాపులారిటీ సొంతం చేసుకున్న వివేక్‌ అగ్ని హోత్రి ఇప్పుడు ది వ్యాక్సిన్‌ వార్‌ అంటూ మరో ఇంట్రెస్టింగ్‌ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. కాంతారా హీరోయిన్‌ సప్తమి గౌడ ఇందులో కీ రోల్‌ పోషిస్తోంది. అలాగే నానా పటేకర్‌, పల్లవి జోషి, రైమాసేన్‌, అనుపమ్‌ ఖేర్‌, నివేదిత భట్టాచార్య వంటి స్టార్‌ యాక్టరర్లు ఈ సినిమాలో కనిపించనున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ది వ్యాక్సిన్‌ వార్‌ ఈనెల 28న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్‌ కానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను ముమ్మరం చేశారు మేకర్స్‌. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లను రిలీజ్‌ చేశారు. అంతకుముందే విదేశాల్లో కూడా సొంత ఖర్చులతో ది వ్యాక్సిన్‌ వార్‌ ప్రీమియర్‌ షోలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇండియాలో కూడా సెలబ్రిటీల కోసం స్పెషల్‌ షోస్ వేస్తున్నారు. ఇటీవలే హీరో మాధవన్‌ ది వ్యాక్సిన్‌ వార్‌ సినిమాను చూశారు. సినిమా చాలా బాగుందంటూ మెచ్చుకున్నారు. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి ఈ పాన్‌ ఇండియా సినిమాను వీక్షించారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కన్నడలో ‘అందరికీ నమస్కారం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె ఆపై ఆంగ్లంలో సినిమాపై రివ్యూ ఇచ్చారు.

‘ది వ్యాక్సిన్‌ వార్‌’ని ‘హృదయానికి హత్తుకునే’ సినిమా. అలాగే ఒక మహిళగా నేను సాటి మహిళలను అర్థం చేసుకోగలను. ఒక మహిళ కెరీర్‌లో ముందుకు సాగుతూనే భార్య, తల్లిగా తన బాధ్యతలను కూడా నెరవేర్చాలి.ముఖ్యంగా పిల్లల్ని చూసుకుంటూ కెరీర్ లో సక్సెస్ కావడం అంత సులభం కాదు. అందుకు ఫ్యామిలీ సపోర్టు ఉండాలి. కోవిడ్ సమయంలో ఎంతో మంది మహిళా శాస్త్రవేత్తలు ల్యాబ్‌కు వచ్చి పరిశోధనలు చేశారు. ఇదే విషయాన్ని ది వ్యాక్సిన్ వార్ సినిమాలో చూపించారు. శాస్త్రవేత్తలు నెలల తరబడి ల్యాబ్‌ల్లో గడిపారు. దీని ఫలితమే ఆరోగ్యకరమైన డెమొక్రటిక్ కంట్రీ. ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాము. చిన్న పిల్లలు తమ తల్లుల విజయాలను చూసి ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. అలాంటి మంచి సందేశాన్ని ఈ సినిమాలో చూపించారు. దీనికి సంబంధించిన వీడియోను డైరెక్టర్ వివేక్‌ అగ్ని హోత్రి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోగా అది కాస్తా వైరలవుతోంది. కాగా ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా భారతదేశపు తొలి బయో సైన్స్ సినిమా అని డైరెక్టర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ది వ్యాక్సిన్ వార్ సినిమాను చూసిన సుధా మూర్తి..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.