Sonu Sood: అందరినీ చల్లగా చూడమ్మా.. దుర్గమ్మను దర్శించుకున్న నటుడు సోనూ సూద్ ..
విజయవాడ కనకదుర్గమ్మ వారిని సినీనటుడు సోనూ సూద్ దర్శించుకున్నారు. ఆయనను ఆలయ అర్చకులు ఆహ్వానించి.. తీర్థ, ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ...

విజయవాడ కనకదుర్గమ్మ వారిని సినీనటుడు సోనూ సూద్ దర్శించుకున్నారు. ఆయనను ఆలయ అర్చకులు ఆహ్వానించి.. తీర్థ, ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదంను అందజేశారు. కరోనా బారి నుంచి ప్రజలను కాపాడాలని అమ్మవారిని ప్రార్థించానని సోనూసూద్ తెలిపారు. సోనూసూద్ మాట్లాడుతూ దుర్గమ్మను దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అందరినీ చల్లగా కాపాడాలని దుర్గమ్మను కోరుకున్నానని సోనూ సూద్ తెలిపారు.
అంతకు ముందు.. విజయవాడ నగరంలో అంకుర ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకుర హాస్పిటల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను రియల్ హీరో కాదు నిజ జీవితంలో సామాన్యులే రియల్ హీరోస్ అని అన్నారు. సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా పేదలకు సహాయం అందించాలి అనుకుంటే అందించవచ్చని తెలిపారు. అంకుర హాస్పిటల్ ద్వారా పేద ప్రజలకు సామాన్యులకు వైద్య సేవలు అందుతాయని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నానని సోనూ సూద్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: Apple Ice Cream : రుచికరమైన యాపిల్ ఐస్ క్రీమ్‌ను ఇంట్లో ప్రయత్నించి చూడండి.. చాలా ఈజీ..