AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stree 2: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న స్త్రీ 2.. 3 రోజుల్లో 135 కోట్లు.. ఎక్కువ రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా?

వరుస పరాజయాలతో డీలా పడిపోయిన బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి 'స్త్రీ 2' ఊపిరిపోసింది. గత కొన్నినెలలుగా సరైన విజయం కోసం ముఖం వాచిపోయేలా ఎదురుచూసిన వారికి బ్లాక్ బస్టర్ ను అందించింది. అదే శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన 'స్త్రీ 2'. రాజ్‌కుమార్ రావ్, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు.

Stree 2: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న స్త్రీ 2.. 3 రోజుల్లో 135 కోట్లు.. ఎక్కువ రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా?
Stree 2 Movie
Basha Shek
|

Updated on: Aug 18, 2024 | 12:42 PM

Share

వరుస పరాజయాలతో డీలా పడిపోయిన బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ‘స్త్రీ 2’ ఊపిరిపోసింది. గత కొన్నినెలలుగా సరైన విజయం కోసం ముఖం వాచిపోయేలా ఎదురుచూసిన వారికి బ్లాక్ బస్టర్ ను అందించింది. అదే శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘స్త్రీ 2’. రాజ్‌కుమార్ రావ్, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ దెయ్యం కథ ప్రేక్షకులకు బాగా నచ్చింది. దీంతో విడుదలైన ప్రతి చోటా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగ ఆగస్టు 15న విడుదలై స్త్రీ 2 కేవలం 3 రోజుల్లోనే 135 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రీమియర్ షో ద్వారా రూ.8.5 కోట్లు, మొదటి రోజు కలెక్షన్ల ద్వారా రూ.51.8 కోట్లు, రెండో రోజు రూ.31.4 కోట్లు, శనివారం రూ.44 కోట్లు రాబట్టింది. దీని ద్వారా మొత్తం వసూళ్లు 135 కోట్ల రూపాయలు. ‘స్త్రీ 2’ సినిమాకు ఆదివారం (ఆగస్టు 18) కీలకం. ఆదివారం ఈ సినిమా దాదాపు రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. అలాగే రక్షా బంధన్ కారణంగా కొన్ని చోట్ల సోమవారం సెలవు. ఇది సినిమాకు హెల్ప్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

స్త్రీ’ సినిమా 2018లో విడుదలై ప్రశంసలు అందుకుంది. దానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘స్త్రీ 2’ సినిమా రూపొందింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన హారర్ సినిమలో తమన్నా భాటియా, వరుణ్ ధావన్ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాతో రాజ్‌కుమార్, శ్రద్ధా కపూర్‌లు భారీ విజయాన్ని అందుకున్నారు. ఇందులో నటించిన తారల రెమ్యునరేషన్‌ విషయానికి వస్తే..హీరో రాజ్‌కుమార్‌ రావు రూ.6 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ రూ.5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. కీలకపాత్రలో మెప్పించిన పంకజ్‌ త్రిపాఠి రూ.3 కోట్ల మేర పారితోషకం తీసుకున్నారట. అలాగే అపరశక్తి ఖురానా.. రూ.70 లక్షలు, అభిషేక్‌ బెనర్జీ రూ.55 లక్షలు అందుకున్నారు. ఇక అతిథి పాత్రలో కనిపించిన వరుణ్‌ ధావన్‌.. ఏకంగా రూ.2 కోట్లు అందుకున్నాడట. ఇక స్పెషల్ సాంగ్ లో సందడి చేసిన తమన్నా కు కూడా భారీగానే రెమ్యునరేషన్ ముట్టిందని సమాచారం.

స్త్రీ 2 ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.