Tollywood: ఈ క్యూట్ ఫ్రెండ్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు.. ఎవరో గుర్తు పట్టారా?
పై ఫొటోలో ఒక రకమైన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్ తో పోజులిస్తోన్న ఈ ఇద్దరినీ గుర్తు పట్టారా? వీరిద్దరూ మంచి స్నేహితులు. అంతే కాదు వీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు గా చెలామణి అవుతున్నారు. ఒకరు స్టార్ కథానాయికగా దక్షిణాది సినిమాలను ఏలేస్తుంటే.. మరొకరు ట్యాలెంటెడ్ యాక్టర్ గా బాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల వీరు నటించిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

పై ఫొటోలో ఒక రకమైన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్ తో పోజులిస్తోన్న ఈ ఇద్దరినీ గుర్తు పట్టారా? వీరిద్దరూ మంచి స్నేహితులు. అంతే కాదు వీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు గా చెలామణి అవుతున్నారు. ఒకరు స్టార్ కథానాయికగా దక్షిణాది సినిమాలను ఏలేస్తుంటే.. మరొకరు ట్యాలెంటెడ్ యాక్టర్ గా బాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల వీరు నటించిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో వీరి పేర్లు ట్రెండింగ్ లో ఉన్నాయి. మరి ఈ క్యూట్ ఫ్రెండ్స్ ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుదాం లెండి. వీరు మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, తంగలాన్ హీరోయిన్ మాళవికా మోహనన్. సినిమా ఇండస్ట్రీలో వీరు ఎప్పటినుంచో మంచి స్నేహితులుగా ఉన్నారు. ఎక్కువగా కలవకపోయినా ఒకరి సినిమాలకు మరొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకోవడం, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో పరస్పరం విష్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. గతంలో ఓనం పండగ సందర్భంగా మాళవిక ఇంటికి కూడా వెళ్లాడు విక్కీ కౌశల్. అలాగే పలు సందర్భాల్లోనూ కలిసి కనిపించారీ స్నేహితులు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే తంగలాన్ సినిమాతో మరో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది మలయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్. ఇందులో నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి పాత్రలో అద్భుతంగా నటించిందీ అందాల తార. విక్రమ్ తో సరిగా ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ తో కలిసి ది రాజా సాబ్ సినిమాలో నటిస్తోంది. అలాగే మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు మాళవిక చేతిలో ఉన్నాయి.ఇక విక్కీ కౌశల్ కూడా ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. అతను ఇటీవల నటించిన బ్యాడ్ న్యూస్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కమర్షియల్ గానూ మంచి వసూళ్లను సాధించింది.
మాళవికా మోహనన్ తో విక్కీ కౌశల్..
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
తంగలాన్ సినిమాలో విక్రమ్ తో మాళవికా మోహనన్..
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








