పెళ్లి చేసుకోవడం ఇష్టమే! కానీ పార్ట్‌నర్ ఎక్కడున్నాడో తెలియదు.. మ్యారేజ్ గురించి చెబుతున్న బాలీవుడ్ వెటరన్ బ్యూటీ..

Shamitha Shetty:బాలీవుడ్ హీరోయిన్ షమితా శెట్టి చివరగా క్రైమ్ డ్రామా సిరీస్ ‘బ్లాక్ విడోస్‌’లో కనిపించి మెప్పించింది. 42 ఏళ్ల వయసులోనూ సూపర్ హాట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసిన భామ..

  • uppula Raju
  • Publish Date - 6:06 pm, Fri, 5 March 21
పెళ్లి చేసుకోవడం ఇష్టమే!  కానీ పార్ట్‌నర్ ఎక్కడున్నాడో తెలియదు.. మ్యారేజ్ గురించి చెబుతున్న బాలీవుడ్ వెటరన్ బ్యూటీ..

Shamitha Shetty:బాలీవుడ్ హీరోయిన్ షమితా శెట్టి చివరగా క్రైమ్ డ్రామా సిరీస్ ‘బ్లాక్ విడోస్‌’లో కనిపించి మెప్పించింది. 42 ఏళ్ల వయసులోనూ సూపర్ హాట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసిన భామ.. ఇతర క్యారెక్టర్స్‌కు భిన్నంగా కనిపించేందుకు చాలా కేర్ తీసుకుంది. అయితే స్క్రీన్‌పై హాట్‌ అండ్ సెక్సీగా కనిపించే తాను, రియల్ లైఫ్‌లో మాత్రం చాలా సింపుల్‌గా ఉంటానని తెలిపింది. షార్ట్స్, లూజ్ టీ షర్ట్స్‌లో కంఫర్ట్‌గా ఫీల్ అవుతానని, మేకప్ వేసుకోవడం అస్సలు ఇష్టముండదని చెప్పింది.

అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుంటారన్న దానిపై స్పందించిన భామ.. ‘నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే కానీ, నా పార్ట్‌‌నర్ ఎక్కడున్నాడో తెలియదే. తను నన్ను త్వరగా కనుగొనాల్సి ఉంది’ అని సమాధానమిచ్చింది. ప్రేమపై అపారమైన నమ్మకముందని, అయితే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తే, పెళ్లి చేసుకోవాలంటేనే భయమేస్తుందని చెప్పింది. జీవితాంతం ఒకే వ్యక్తితో ఉండాలని కోరుకుంటున్నానని, అలాంటి నమ్మకం కలిగించే వ్యక్తి కలిసినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటానని తెలిపింది.

20 ఏళ్ల కెరియర్‌లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశానని, అవన్నీ కూడా తనను మరింత బలంగా చేశాయని తెలిపింది. పరిశ్రమలో భాగమయ్యే అవకాశం దొరికినందుకు థాంక్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నట్లు పేర్కొంది. కొన్నాళ్లుగా చాలా మందితో సన్నిహితంగా ఉన్నానని, వారి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నానని చెప్పింది. సినీ పరిశ్రమ ఒక నకిలీ ప్రపంచం అని.. ఇక్కడ జాగ్రత్తగా లేకపోతే మనల్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. షమితా శెట్టి 2000 సంవత్సరంలో ‘మొహబ్బతే’ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులోనూ ‘పిలిస్తే పలుకుతా, డాడీ’ చిత్రాల్లో కనిపించిన హీరోయిన్ సోదరి శిల్పా శెట్టిలాగా అనుకున్నంతగా రాణించలేకపోయింది.

కుండలోని నీరు తాగండి కూల్‌గా ఉండండి.. ఎన్ని లాభాలో తెలిస్తే ఫ్రిజ్ వాటర్‌ని ఇప్పుడే వదిలేస్తారు..

A1 Express Movie Review: గమ్యాన్ని చేరుకున్న ‘A1 ఎక్స్‏ప్రెస్’.. హాకీ ప్లేయర్‏గా మెప్పించిన సందీప్ కిషన్..