బిగ్‏బాస్ విన్నర్ ఇంట్లో తీవ్ర విషాదం.. అస్వస్థతతో తండ్రి అకాల మరణం.. భావోద్వేగ పోస్ట్..

హిందీ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ విన్నర్‌ గౌహర్‌ ఖాన్‌ తండ్రి తీవ్ర అస్వస్థతో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. ఇటీవలే గౌహర్ ఖాన్ ఆసుపత్రిలో ఉన్న తన తండ్రి

  • Rajitha Chanti
  • Publish Date - 8:17 pm, Fri, 5 March 21
బిగ్‏బాస్ విన్నర్ ఇంట్లో తీవ్ర విషాదం.. అస్వస్థతతో తండ్రి అకాల మరణం.. భావోద్వేగ పోస్ట్..

హిందీ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ విన్నర్‌ గౌహర్‌ ఖాన్‌ తండ్రి తీవ్ర అస్వస్థతో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. ఇటీవలే గౌహర్ ఖాన్ ఆసుపత్రిలో ఉన్న తన తండ్రి చేయి పట్టుకొని ఉన్న నా జీవితం నా పప్పా అంటూ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. గత కొన్ని రోజుల క్రితం గౌహర్ ఖాన్ తండ్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో గౌహర్ తన షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని తండ్రి దగ్గరే ఉండిపోయింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం గౌహర్ ఖాన్ తండ్రి మరణించాడు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది గౌహర్ ఖాన్. నా హీరో. మీలాంటి వ్యక్తి ఎవరు ఉండరు. మా నాన్నగారు చనిపోయారు. మా నాన్న ఒక దేవదూతగా వెళ్లిపోయాడు. అల్హాముదుల్లా. నా జీవితానికి అర్థం మానాన్న. ఫరెవర్ మై పప్పా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీరు నాలోనే ఉన్నారు పప్పా. #MyForeverShiningStar అంటూ రాసుకోచ్చింది. ఇక తన వివాహంలో తనను తన తండ్రి ప్రేమగా దగ్గరకు తీసుకుంటున్న ఫోటోను షేర్ చేసింది గౌహర్. తండ్రి మరణించిన విషయాన్ని షేర్ చేయగానే పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. ఈ బాలీవుడ్‌ నటి, కొరియోగ్రాఫర్‌ జైద్‌ దర్బార్‌ను డిసెంబర్‌ 25న పెళ్లాడింది.

కోవిడ్‌ కారణంగా అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిఖా జరిగింది. జైద్‌ కంటే గౌహర్‌ ఎనిమిదేళ్లు పెద్దదైనప్పటికీ వారిది స్వచ్ఛమైన ప్రేమ అని, పెళ్లికి వయసుతో పని లేదంటూ వారి షాదీ దగ్గరుండి జరిపించాడు జైద్‌ తండ్రి, బాలీవుడ్‌ కంపోజర్‌ ఇస్మాయిల్‌ దర్బార్. కాగా మాజీ మోడల్‌ అయిన గౌహర్‌ అనేక టీవీ షోలలో కనిపించింది. హిందీ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొని విజేతగా అవతరించిన ఆమె 14వ సీజన్‌లోనూ హౌస్‌లోకి వెళ్లి వచ్చింది. ఇటీవలే ఆమె తాండవ్‌ వెబ్‌ సిరీస్‌లో నటించగా దానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమైన ఈ వెబ్‌ సిరీస్‌లో సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో నటించాడు.

 

View this post on Instagram

 

A post shared by GAUAHAR KHAN (@gauaharkhan)

Also Read:

Vadinamma Serial Actress Sujitha: ‘వదినమ్మ’ ఫేం సుజీత (సీత) గురించి ఆసక్తికర విషయాలు… అందమైన ఫోటోలు..