AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathan collection: బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోన్న షారూఖ్‌ ఊచకోత.. ఆ సినిమాను వెనక్కి నెట్టేసి మరీ..

వరుస పరాజయాలతో సతమవుతోన్న సమయంలో వచ్చిన పఠాన్‌ చిత్రం ఒక్కసారిగా షారుఖ్‌కు బిగ్ రిలీఫ్‌ ఇచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తోంది. అనూహ్య కలెక్షన్స్‌తో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన తర్వాత...

Pathan collection: బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోన్న షారూఖ్‌ ఊచకోత.. ఆ సినిమాను వెనక్కి నెట్టేసి మరీ..
Pathan Collection
Narender Vaitla
|

Updated on: Feb 04, 2023 | 7:52 PM

Share

వరుస పరాజయాలతో సతమవుతోన్న సమయంలో వచ్చిన పఠాన్‌ చిత్రం ఒక్కసారిగా షారుఖ్‌కు బిగ్ రిలీఫ్‌ ఇచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తోంది. అనూహ్య కలెక్షన్స్‌తో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన తర్వాత ప్రతీ రోజూ రూ. వంద కోట్లకు తగ్గకుండా బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తోంది. తొలి వారం పూర్తయ్యేసరికి పఠాన్‌ ఏకంగా రూ. 650 కోట్లు కలెక్ట్‌ చేసి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.

శనివారం కలెక్షన్స్‌తో ‘దంగల్‌’ రికార్డును బ్రేక్‌ చేసి హిందీలో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన మూడో సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. మొదటి రెండు స్థానాల్లో ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్‌-2’ సినిమాలున్నాయి. ఇక్కడే అనుకుంటే ఓవర్సీస్‌లోనే పఠాన్‌ వీర విహారం చేస్తున్నాడు. ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘బాహుబలి-2’ ఫుల్‌రన్‌లను జపాన్‌, చైనా రిలీజు లేకుండానే అధిగమించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే పఠాన్‌ వెయ్యి కోట్ల మార్కును అందుకోవడం కష్టం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీకెండ్‌కు ఎలాంటి సినిమాలు లేకపోవడం కూడా పఠాన్‌కు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా రూ. 729 కోట్లు కలెక్ట్ చేసినట్లు యష్‌రాజ్‌ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 88.92 మిలియన్ల డాలర్లతో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఓవర్‌సీస్‌లోనే పఠాన్‌ ఏకంగా రూ. 276 కోట్లు వసూలు చేయడం విశేషం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..