
బాలీవుద్ బాద్ షా.. ఈ పేరు ఒక్క రాత్రిలో వచ్చింది కాదు. ఎన్నో సంవత్సరాల కష్టం.. ఎన్నో అవమానాలు.. ఒడిదుడుకులు ఎదుర్కొని స్టార్ హీరోగా ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయనే బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ కానప్పటికీ నటనపై ఉన్న ఆసక్తితో సీనిపరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. బుల్లితెరపై పలు టీవీ సీరియల్స్ ద్వారా కెరీర్ ఆరంభించారు షారుఖ్. 1992లో దీవానా సినిమాతో హీరోగా బిగ్ స్ర్కీన్ పై సందడి చేశారు. ఇక ఆ తర్వాత బాజిగర్, అంజామ్ వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించారు. షారుఖ్ కెరీర్ లో దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ఈ చిత్రాలతో బాద్ షా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన షారుఖ్.. ఇప్పటివరకు రొమాంటిక్ క్లాసీ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇక తాజాగా విడుదలైన జవాన్ సినిమా మాస్ హీరోగానూ అదరగొట్టారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు రికార్డ్స్ సృష్టిస్తోంది. మొదటిరోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకున్న సినిమా కలెక్షన్స్ ఎక్కువగానే రాబడుతుంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న అత్యంత సంపన్న నటులలో షారుఖ్ ఒకరు. ముంబైలో ఎంతో విలువైన విలాసవంతమైన షారుఖ్ ఇంటి పేరు మన్నత్. ఈ భవనానికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో చాలాసార్లు చక్కర్లు కొట్టాయి. కానీ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో షారుఖ్ కు విలాసవంతమైన విల్లా ఉందని తెలుసా ?.
Finally the California sun is out….it’s time for the Pool…maybe should dress right for it now at my @airbnb villa in LA #Ad #LAonAirbnb pic.twitter.com/PPmRHQLL4u
— Shah Rukh Khan (@iamsrk) December 5, 2019
అమెరికాలో రాజభవనాన్ని తలపించేలా షారుఖ్ విల్లా ఉంది. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ లోని ఓ నివేధిక ప్రకారం లాస్ ఏంజిల్స్ లోని షారుఖ్ విలాసవంతమైన విల్లాలో ఒక్కరోజు రాత్రి ఉండాలంటే సుమారు రూ.1.96 లక్షలకు పైగా అద్దె చెల్లించాల్సి ఉంటుందట. ఈ విలాసవంతమైన భవనం Airbnbలో అద్దెకు అందుబాటులో ఉంది. లాస్ ఏంజిల్స్ ది బెవర్లీ హిల్స్ లో ఈ విశాలమైన విల్లా ఉంది. ఇందులో దాదాపు ఆరు బెడ్ రూమ్స్, విశాలమైన జాకుజీలు, పెద్ద స్విమ్మింగ్ పూరల్, ప్రైవేట్ కాబనాస్, ప్రైవేట్ టెన్నిస్ కోర్ట్ ఉంది. అమెరికా వెళ్లిన ప్రతిసారి షారుఖ్ ఇదే విల్లాలో ఉంటారు. ఈ భవనంకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలపై మీరు ఓ లుక్కెయ్యండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.