Jawan: వెంటిలేటర్‌ సపోర్టుతో ‘జవాన్‌’ సినిమా చూసిన అభిమాని.. వీడియోపై షారుక్‌ ఖాన్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?

|

Sep 19, 2023 | 5:50 PM

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. థియేటర్లోకి ఆయన సినిమా వచ్చిందంటే చాలు పండగ చేసుకుంటారు ఫ్యాన్స్‌. ఎలాగైనా ఫస్ట్‌ డేనే చూడాలనుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కింగ్‌ఖాన్‌కు బోలెడు మంది అభిమానులు ఉన్నారు. ఇక షారుక్‌ ఖాన్‌ నటించిన తాజా చిత్రం జవాన్‌. పఠాన్ వంటి బ్లాక్‌ బస్టర్‌హిట్‌ తర్వాత వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది

Jawan: వెంటిలేటర్‌ సపోర్టుతో జవాన్‌ సినిమా చూసిన అభిమాని.. వీడియోపై షారుక్‌ ఖాన్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?
Shah Rukh Khan
Follow us on

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. థియేటర్లోకి ఆయన సినిమా వచ్చిందంటే చాలు పండగ చేసుకుంటారు ఫ్యాన్స్‌. ఎలాగైనా ఫస్ట్‌ డేనే చూడాలనుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కింగ్‌ఖాన్‌కు బోలెడు మంది అభిమానులు ఉన్నారు. ఇక షారుక్‌ ఖాన్‌ నటించిన తాజా చిత్రం జవాన్‌. పఠాన్ వంటి బ్లాక్‌ బస్టర్‌హిట్‌ తర్వాత వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు రూ.850 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది జవాన్‌. ఈ జోరు చూస్తుంటే త్వరలోనే షారుక్‌ సినిమా 1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మూడు రోజుల క్రితం షారుక్‌ వీరాభిమాని ఒకరు వెంటిలేటర్‌ సపోర్టుతో థియేటర్‌కు వెళ్లి జవాన్‌ సినిమాను చూశారు. అనీస్ ఫరూఖీ అనే వ్యక్తి తన వెంటిలేటర్‌తో థియేటర్‌కు వచ్చి వీల్‌ చైర్‌లో కూర్చొని షారుక్‌ సినిమాను చూశాడు. దీనికి సంబంధించిన ఈ వీడియోని ఓ నెటిజన్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘షారుక్‌ ఖాన్ వచ్చిన తర్వాత మనసు కాదు.. గుండె పని చేయడం మొదలవుతుంది. ఒక దివ్యాంగుడు వెంటిలేటర్‌పై మీ సినిమా చూస్తున్నాడు. షారుక్‌ సార్ ఇదీ ప్రజలకు మీపై ఉన్న ప్రేమ, అభిమానం’ అని ఈ పోస్టులో రాసుకొచ్చాడు నెటిజన్‌. అంతేకాదు తన పోస్టుకు షారుక్‌ ఖాన్‌ను కూడా ట్యాగ్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోను చూసిన షారుక్‌ ఖాన్‌ స్పందించారు. అనీస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘థాంక్యూ మై ఫ్రెండ్.. దేవుడు మీకు ప్రపంచంలోని అన్ని ఆనందాలను ప్రసాదించాలని ప్రార్థి్స్తున్నాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను కృతజ్ఞుడిని. మీరు మా సినిమాను ఆస్వాదించారని ఆశిస్తున్నాను. ప్రేమతో మీ షారుక్‌’ అంటూ అనీస్‌ వీడియోను రీట్వీట్‌ చేశాడు కింగ్‌ ఖాన్‌. తీవ్ర తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దివ్యాంగుడు జవాన్‌ సినిమాకు రావడం, ఇది షారుక్‌ మనసును కూడా తాకిందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సౌతిండియన్‌ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన జవాన్‌ సినిమాలో షారుక్‌ డ్యూయెల్‌ రోల్‌లో కనిపించారు. నయనతార హీరోయిన్ గా నటించింది. దీపికా పదుకొనే, ప్రియమణి, విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి డోగ్రా తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. షారుక్‌ సొంత బ్యానర్‌ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై గౌరీఖాన్‌ జవాన్‌ సినిమాను నిర్మించారు. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

వెంటిలేటర్ సహాయంతో జవాన్ సినిమాను చూస్తోన్న దివ్యాంగుడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.