బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. . ఎన్నో దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ బాలీవుడ్ బాద్ షాగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే షారుఖ్ ఖాన్ కు ముగ్గురు పిల్లలు. కూతురు సుహానా ఖాన్ ఇప్పటికే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలాగే కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో షారుఖ్ మూడో కుమారుడు అబ్ రామ్ గురించి ఇటీవల ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. షారుఖ్ కు సంబంధించిన పాత ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో చివరి కుమారుడికి అబ్రామ్ అని ఎందుకు పేరు పెట్టారో కింగ్ ఖాన్ వివరించాడు. ఈ పేరు వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంది. అదేంటంటే..
కొన్ని రోజుల క్రితం రజత్ శర్మ ‘ఆప్ కీ అదాలత్’లో షారుఖ్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సమయంలో అభిమానులు షారుక్‌ను ప్రశ్నలు అడిగారు. ఆఖరి కుమారుడికి అబ్ రామ్ అని ఎందుకు పేరు పెట్టారని ప్రశ్నించారు. దీనికి షారుక్ ఖాన్ ఇలా సమాధానమిచ్చాడు. ‘ఇస్లాం మతానికి చెందిన హజ్రత్ ఇబ్రహీం బైబిల్‌లో అబ్రహం అని, జుడాయిజంలో అబ్రామ్ అని పిలుస్తారు. నా భార్య హిందువు, నేను ముస్లింని. కాబట్టి, ఇంట్లో వారు సెక్యులర్‌గా భావించాలని నేను కోరుకుంటున్నాను. మన దేశంలో ఉన్న సామరస్యం ఇక్కడ కూడా ఉందని నేను నమ్ముతున్నాను’ అని షారుఖ్ చెప్పుకొచ్చారు.
షారుక్ ఖాన్ గౌరీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతనికి భార్య అంటే చాలా ప్రేమ. అందుకే షారుఖ్ ఇంట్లో హిందూ పండుగలను కూడా ఘనంగా జరుపుకొంటారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. పఠాన్, జవాన్, డుంకీ చిత్రాలతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు షారుఖ్. ఈ మూవీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.