Prithviraj Movie: అద్భుతమైన మూవీ ‌పృథ్వీరాజ్‌ని మన మందరం థియేటర్‌లోనే చూద్దాం.. పైరసీ చేయద్దంటూ అక్షయ్ విజ్ఞప్తి..

|

Jun 03, 2022 | 5:16 PM

సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా విడుదలైన నేపథ్యంలో అక్షయ్ కుమార్ మరోసారి సినీ ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేశాడు. సినిమా విడుదలకు ముందే.. సోషల్ మీడియా ద్వారా సినిమాకు సంబంధించిన వీడియో క్లిప్స్ ను షేర్ చేయవద్దంటూ అక్షయ్ అభిమానులను అభ్యర్థించాడు.

Prithviraj Movie: అద్భుతమైన మూవీ ‌పృథ్వీరాజ్‌ని మన మందరం థియేటర్‌లోనే చూద్దాం.. పైరసీ చేయద్దంటూ అక్షయ్ విజ్ఞప్తి..
Samrat Prithviraj
Follow us on

Prithviraj Movie: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ “సామ్రాట్ పృథ్వీరాజ్”  ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమాలో పృథ్వీరాజ్ గా అక్షయ్ కుమార్ అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీని అభిమానులు చాలా ఇష్టపడుతున్నారు. అదే సమయంలో మానుషి కూడా సంయోగిత పాత్రలో ఒదిగిపోయింది.. అద్భుతమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా విడుదలైన నేపథ్యంలో అక్షయ్ కుమార్ మరోసారి సినీ ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేశాడు. సినిమా విడుదలకు ముందే..  సోషల్ మీడియా ద్వారా సినిమాకు సంబంధించిన వీడియో క్లిప్స్ ను షేర్ చేయవద్దంటూ అక్షయ్ అభిమానులను అభ్యర్థించాడు.

సినిమా విడుదలయ్యాక అభిమానులకు అక్షయ్ విన్నపం
బాలీవుడ్  ఐకాన్ స్టార్ అక్షయ్ కుమార్ సినిమా విడుదలైన తర్వాత అభిమానులకు మరోసారి విజ్ఞప్తి చేశాడు. అక్షయ్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఒక లెటర్ ను ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. థియేటర్‌లో సినిమా చూసేటప్పుడు ఎలాంటి వీడియోలు తీయవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు.. ఆన్‌లైన్‌లో సినిమాను ఏ విధంగానూ లీక్ చేయవద్దని కోరాడు. అక్షయ్ కుమార్ తన లెటర్ లో చిత్రానికి సంబంధించిన పైరసీ సినిమాను, వీడియోలను లీక్ చేయవద్దంటూ  పేర్కొన్నాడు.

థియేటర్ లో మూవీ చిత్రీకరణ వద్దంటూ విజ్ఞప్తి: 
అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో యష్ రాజ్ ఫిల్మ్స్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.  ‘ఒక భారీ చిత్రం, గొప్ప సినిమా చూసిన అనుభవం రావాలంటే ఈ సినిమాను వెండి తెరపైనే చూడాలని కోరాడు. అంతేకాదు ఈ  సినిమా చూస్తున్న సమయంలో ఎలాంటి వీడియోలు తీసుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపాడు. ఇక సినిమా చూస్తున్నప్పుడు ఆన్‌లైన్‌లో షేర్ చేయకండి. సినిమా పైరసీ వీడియోలను తయారు చేయవద్దంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు. మనమందరం ఈ అద్భుత కథను థియేటర్లలో మాత్రమే చూద్దాంమని కోరాడు. అంతేకాదు పృథ్వీరాజ్ మూవీ పైరసీని నిరోధించడానికి అందరూ సహకరించాలని.. తెలిసినవారు [email protected] లో తెలియజేయమని కోరాడు.

ఇవి కూడా చదవండి

సినిమా విడుదలకు ముందే అక్షయ్ కుమార్ .. పృథ్వీరాజ్ గా ట్రైలర్ టీజర్ లో  ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.  ఈ చిత్రాన్ని ‘అసలైన చారిత్రాత్మకం’గా అభివర్ణించిన అక్షయ్, మన దేశ ప్రజలకు అంతగా తెలియని పాత్ర జీవితంలో చాలా అంశాలు ఉన్నాయని పేర్కొన్నాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి