Prithviraj Movie: పృథ్విరాజ్‌గా ఆకట్టుకున్న అక్షయ్.. హిందూస్తాన్ సింహం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటున్న నెటిజన్లు..

పృథ్వీరాజ్ ట్రైలర్‌ను ట్విట్టర్‌లో పంచుకుంటూ అక్షయ్ కుమార్ ‘శౌర్యం, పరాక్రమాల అమర కథ.. ఇది సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ కథ.. అంటూ క్యాప్షన్ తో పాటు.. #HindustanKaSher అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు

Prithviraj Movie: పృథ్విరాజ్‌గా ఆకట్టుకున్న అక్షయ్.. హిందూస్తాన్ సింహం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటున్న నెటిజన్లు..
Prithviraj Movie
Follow us
Surya Kala

|

Updated on: May 25, 2022 | 10:17 AM

Prithviraj Movie: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హిందూస్థాన్ సింహంగా పేరు గాంచిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథతో ‘పృథ్వీరాజ్’ టైటిల్‌తో తెరకెక్కిన చారిత్రక సినిమాలో పృథ్విరాజ్ గా అక్షయ్ కుమార్, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్ మహారాణి సంయోగిత పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా కొత్త ట్రైలర్ మంగళవారం విడుదలైంది. అక్షయ్ కుమార్ స్వయంగా ఈ చిత్రం ట్రైలర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పృథ్వీరాజ్ ట్రైలర్‌ను ట్విట్టర్‌లో పంచుకుంటూ అక్షయ్ కుమార్ ‘శౌర్యం, పరాక్రమాల అమర కథ.. ఇది సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ కథ.. అంటూ క్యాప్షన్ తో పాటు..  #HindustanKaSher అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు . ప్రస్తుతం ఈ ట్రైలర్ ను సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ అందరూ ఇష్టపడుతున్నారు.  కొందరు అక్షయ్ కుమార్ లుక్‌ని ఇష్టపడుతున్నారు, మరికొందరు యాక్షన్‌ ని ఇష్టపడుతున్నారు.  మరికొందరు ‘హిందూస్థాన్ కా లయన్’ వస్తోందని రాశారు.

ఈ చిత్రం చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం, మహ్మద్ ఘోరీపై అతని యుద్ధం ఆధారంగా రూపొందింది. రెండు నిమిషాల 53 సెకన్ల ఈ ట్రైలర్‌లో ఊపిరి బిగపట్టే సన్నివేశాలు ఉన్నాయి.

అక్షయ్ కుమార్, మానుషితో పాటు సంజయ్ దత్ కాకా కన్హాగా, సోనూ సూద్..  చాంద్ బర్దాయిగా, అశుతోష్ రాణా..  జైచంద్రగా, మానవ్ విజ్..  మహమ్మద్ ఘోరీగా కనిపించనున్నారు.

ప్రస్తుతానికి ట్రైలర్‌ని ఆస్వాదించండి మరియు జూన్ 3న మీ దగ్గరలోని థియేటర్‌లో మాత్రమే పూర్తి సినిమాను చూడండి.   ఈ సినిమా హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో జూన్ 3న విడుదలవుతోంది.  పృథ్వీరాజ్‌ని యష్ రాజ్ ఫిలింస్ నిర్మించింది. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ డ్రామా సినిమా ప్రజలకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి, దీని ట్రైలర్‌ను ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.