Salman Khan: సల్లూ భాయ్‌ ప్రేమ అలా ఉంటది మరి.. బర్త్‌ డే పార్టీలో మాజీ ప్రియురాలికి ముద్దుపెట్టిన సల్మాన్

|

Dec 28, 2022 | 10:49 AM

ల్లూ బర్త్‌డే వేడుకల్లో ఆయన మాజీ ప్రేయసి సంగీతా బిజ్‌లానీ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. అయితే వెళ్లేటప్పుడు అందరి ముందే సంగీత నుదుటిపై ముద్దు పెట్టాడు సల్మాన్‌. అంతేకాదు స్వయంగా కారు డోర్‌ తీసి ఆమెను సాగనంపారు.

Salman Khan: సల్లూ భాయ్‌ ప్రేమ అలా ఉంటది మరి..  బర్త్‌ డే పార్టీలో మాజీ ప్రియురాలికి ముద్దుపెట్టిన సల్మాన్
Salman Khan
Follow us on

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ మంగళవారం (డిసెంబర్‌ 27) 57వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆయన సోదరి అర్పితా ఖాన్‌ నివాసంలో సల్లు భాయ్ బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ సెలబ్రేషన్స్‌కు హాజరయ్యారు. జాన్వీకపూర్‌, పూజా హెగ్డే, టబు, సునీల్ శెట్టి, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా, సోనాక్షి సిన్హా, కార్తీక్ ‌ఆర్యన్‌ తదితరులు సల్లూభాయ్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. ఈ బర్త్‌ డే పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కూడా వైరలయ్యాయి. కాగా ఈ వేడుకల్లో సల్మాన్ చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే సల్లూ బర్త్‌డే వేడుకల్లో ఆయన మాజీ ప్రేయసి సంగీతా బిజ్‌లానీ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. అయితే వెళ్లేటప్పుడు అందరి ముందే సంగీత నుదుటిపై ముద్దు పెట్టాడు సల్మాన్‌. అంతేకాదు స్వయంగా కారు డోర్‌ తీసి ఆమెను సాగనంపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

కాగా ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది సంగీత బిజ్లాని. ఆదే సమయంలో సల్మాన్‌తో సుమారు పదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలింది. పెళ్లిపీటలెక్కేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఏమైందో తెలియదు కానీ వీరి బంధం బీటలు వారింది. ఇద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఇక బిజ్లానీ ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ను వివాహం చేసుకుంది. అయితే 2010లో అతనితో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం సింగిల్‌గానే లైఫ్‌ను లీడ్‌ చేస్తుందామె. కాగా మెగాస్టార్‌ చిరంజీవి గాడ్‌ఫాదర్‌లో స్పెషల్‌ రోల్‌లో సందడి చేసిన సల్మాన్‌ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌తో పాటు షారుఖ్‌ ఖాన్ పఠాన్ మూవీలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే వేద్‌, టైగర్‌ 3 సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటున్నాడీ కండల హీరో.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..