
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి బెదిరింపు వచ్చింది. ఏ దేశం వెళ్లి దాక్కున్నా సల్మాన్‌ను చంపేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతను మరోసారి సమీక్షించారు. ఇప్పటికే సల్మాన్‌కి వై ప్లస్ భద్రతను కల్పించారు. లారెన్స్ బిష్ణోయ్‌ని చంపేస్తానని బెదిరించడంతో సల్లూ వద్ద భద్రతను పెంచారు. కాగా ఆదివారం (నవంబర్ 26) సల్మాన్ సన్నిహితుడు ప్రముఖ పంజాబీ గాయకుడు గిప్పీ గ్రేవాల్ ఇంటిపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. దీనికి తామే బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స్వయంగా ప్రకటించింది. ఈ మేరకు ఫేస్ బుక్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ‘నువ్వు (గిప్పీ) సల్మాన్ ఖాన్‌ను నీ సోదరుడిగా భావిస్తున్నావు. మీ సోదరుడు ముందుకు వచ్చి మిమ్మల్ని రక్షించాల్సిన సమయం వచ్చింది. సల్మాన్ ఖాన్ కు కూడా ఈ సందేశం అందాలి. దావూద్ మిమ్మల్ని రక్షిస్తాడనే భ్రమలో ఉండకండి. మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. సిద్దు ముసేవాలా (పంజాబీ సింగర్) మరణం తర్వాత మీ నాటకీయ ప్రతిస్పందనను ఎవరూ పట్టించుకోలేదు. అతను ఎలాంటి వ్యక్తి, అతని నేర చరిత్ర ఏమిటో మనందరికీ తెలుసు. మీరు ఇప్పుడు మా రాడార్‌లో ఉన్నారు. దీనిని ట్రైలర్‌గా పరిగణించండి. త్వరలోనే పూర్తి సినిమా విడుదల కానుంది. ఏ దేశానికైనా పారిపోండి. కానీ మరణానికి వీసా అవసరం లేదని గుర్తుంచుకోండి. ఎలాంటి ఆహ్వానం లేకుండా మీకు చావు ఎదురు రావొచ్చు’ అని బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించింది. ఈ ఖాతా లారెన్స్ బిష్ణోయ్ పేరు మీదే ఉంది. ప్రొఫైల్ ఫొటో కూడా అతనిదే ఉంది. అయితే ఇది ఒరిజినల్ ఖాతా లేదా నకిలీదా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు.
కాగా కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న గిప్పీ గ్రెవాల్ ఇంటి బయట కాల్పులు జరిగాయి. దీనికి బిష్ణోయ్ బాధ్యత వహించాడు. ఇక ఈ ఘటన తర్వాత ‘సల్మాన్ తో నాకెలాంటి సన్నిహిత సంబంధాల్లేవని గిప్పీ గ్రెవాల్ ప్రకటన విడుదల చేశాడు. ‘నేను సల్మాన్‌ని రెండు సార్లు మాత్రమే కలిశాను. అతను నా స్నేహితుడు కాదు’ అని గిప్పీ చెప్పాడు. మరోవైపు బెదిరింపు పోస్ట్ ఎవరు పెట్టారనే దానిపై విచారణ జరుగుతోంది. ఆ సోషల్ మీడియా ఖాతా నిజంగా లారెన్స్ బిష్ణోయ్‌దేనా అనే కోణంలో విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. కాగా ఇలా సల్మాన్‌కు బెదిరింపు లేఖలు రావడం ఈ ఏడాదిలో రెండోసారి. మార్చిలో సల్మాన్ చంపేస్తామంటూ ఈ మెయిల్ ద్వారా హత్యా బెదిరింపులు వచ్చాయి.
Bollywood Actor Salman Khan received a threat through a Facebook post after which his security has been reviewed, say Mumbai Police
— ANI (@ANI) November 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..