Salman Khan Radhe: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేతులెత్తేశారు. ఈ పరిస్థితుల్లో అలా చేయలేనంటూ.. థియేటర్ల యజమానులకు క్షమాపణలు చెప్పారు. ఇంతకీ సల్లూ భాయి అంతగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏమోచ్చిందని అనుకుంటున్నారా.. సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం “రాధే”.. వాంటెడ్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రాన్ని మొదట థియేటర్లలో రిలీజ్ చేస్తామని సల్లూ భాయ్ ప్రకటించారు. దీంతో థియేటర్ యజమానులు భాయ్‌ను కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాని తాజాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సల్మాన్ నిర్ణయం తీసుకున్నారు. దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తున్న రాధే మూవీలో డ్రగ్ మాఫియాను కంట్రోల్ చేసి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు సల్మాన్. డైరెక్టర్‌గా సల్మాన్‌తో ప్రభుదేవాకు ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో వీళ్ల కాంబోలో పోకిరీ రీమేక్ వాంటెడ్, దబ్బంగ్3 వచ్చాయి. డీఎస్‌పీ మార్క్ వున్న క్రేజీ బీట్…. సీటీమార్…. రాధే మూవీలో జబర్దస్త్‌గా రిపీటైంది. ఇక సినిమా డ్యూరేషన్ విషయానికి వస్తే సల్మాన్ కెరీర్‌లో ఇంత షార్ట్ లెంగ్త్‌తో రిలీజ్ అయిన మూడో సినిమా రాధే. గతంలో మై ఔర్ మిసెస్ ఖన్నా, మారీ గోల్డ్ సినిమాలు కూడా రెండు గంటలకన్నా తక్కువ లెంగ్త్‌తో రిలీజ్ అయ్యాయి.
కరోనా సెకండ్ వేవ్‌తో దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో సినిమాని థియేటర్లలో విడుదల చేయడం అనేది అసాధ్యం. అందుకే థియేటర్ యజమానులకు క్షమాపణ చెప్పారు సల్మాన్ . ఇక ‘రాధే’ చిత్రం మే 13న ఓటీటీ ద్వారా విడుదల కానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :