ఫైట్స్ లేవని ఆ మూవీకి నో చెప్పిన అమీర్..చరిత్ర సృష్టించిన సల్మాన్.. 6 కోట్లతో నిర్మాణం 200 కోట్లు వసూళ్లు..

|

Feb 04, 2024 | 12:15 PM

ఈ చిత్రంలో సల్మాన్, మాధురీ దీక్షిత్‌ల జోడీ రొమాంటిక్ గా ఉండి..  తెరపై చాలా అందంగా కనిపించింది. రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 6.25 కోట్లు. అయితే ఈ సినిమా ఖర్చు కంటే 20 రెట్లు ఎక్కువ వసూళ్లను రాబట్టింది. నివేదిక ప్రకారం, ఈ చిత్రం భారతదేశంలోనే 116 కోట్లకు పైగా బిజినెస్ చేసింది . మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 127 కోట్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా  సల్మాన్ కెరీర్‌కు చాలా హెల్ప్ అయింది. అయితే వాస్తవానికి ఈ సినిమా హీరోగా ఫస్ట్ అనుకున్నది సల్మాన్ కాదు.. 

ఫైట్స్ లేవని ఆ మూవీకి నో చెప్పిన అమీర్..చరిత్ర సృష్టించిన సల్మాన్.. 6 కోట్లతో నిర్మాణం 200 కోట్లు వసూళ్లు..
Hum Aapke Hain Koun
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్.. కండల వీరుడు  సల్మాన్ ఖాన్. 1988లో విడుదలైన “బివి హో తో ఐసీ చిత్రం ద్వారా సహాయ నటుడిగా బాలీవుడ్‌లోకి సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. తన సినీ కెరీర్‌లో ఎన్నో హిట్, సూపర్‌హిట్ చిత్రాలను అందించాడు. అలాంటి  సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి  “హమ్ ఆప్కే హై కౌన్”  ఈ సినిమా 30 ఏళ్ల క్రితం 1994లో విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది.

ఈ చిత్రంలో సల్మాన్, మాధురీ దీక్షిత్‌ల జోడీ రొమాంటిక్ గా ఉండి..  తెరపై చాలా అందంగా కనిపించింది. రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 6.25 కోట్లు. అయితే ఈ సినిమా ఖర్చు కంటే 20 రెట్లు ఎక్కువ వసూళ్లను రాబట్టింది. నివేదిక ప్రకారం, ఈ చిత్రం భారతదేశంలోనే 116 కోట్లకు పైగా బిజినెస్ చేసింది . మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 127 కోట్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా  సల్మాన్ కెరీర్‌కు చాలా హెల్ప్ అయింది. అయితే వాస్తవానికి ఈ సినిమా హీరోగా ఫస్ట్ అనుకున్నది సల్మాన్ కాదు..  అమీర్ ఖాన్ ఫస్ట్ ఛాయిస్ అని మీకు తెలుసా.

అమీర్ సినిమాను ఎందుకు తిరస్కరించాడంటే..

ఈ సినిమా ఆఫర్ మొదట అమీర్‌ ఖాన్ కి చేరిందట. అమీర్ ఖాన్ ను చిత్ర నిర్మాత, దర్శకులు సంప్రదించినప్పుడు ఈ సినిమా ఆఫర్‌ని తిరస్కరించాడని అంటున్నారు. స్క్రిప్ట్ నచ్చకపోవడంతో పాటు సినిమాలో విలన్స్ లేరు, ఫైట్స్ లేవు అంటూ సినిమా చేయలేదని అంటున్నారు. ఈ మూవీ 90లో ఓ సంచలనం.. యువతీయువకులను బాగా ఆకట్టుకుంది. నేటికీ టీవీల్లో ఈ సినిమా సాంగ్స్ మ్యాజిక్ చేస్తూనే ఉంటాయి. అంతేకాదు ఇప్పుడు కూడా ఈ సినిమా ఎక్కడ వస్తున్నా చాలా ఆసక్తిగా చూస్తారు.

ఇవి కూడా చదవండి

సల్మాన్ ఖాన్, రేణుకా షహానే , మోహ్నీష్ బహల్ , మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అలోక్ నాథ్, బిందు, దిలీప్ జోషి వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకు రామ్ లక్ష్మణ్ సంగీతం అందించారు. ఈ సినిమా, కథ, పాత్రలు నచ్చడమే కాకుండా పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాలో 14 పాటలున్నా.. నేటికీ అవి ప్రజల నోట్లో నానుతూనే ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..