Ranveer Singh: తొలిసారి దీపికాను ఎక్కడ చూశాడో చెప్పిన రణ్‌వీర్.. అంతా ఫేక్ అంటున్న నెటిజన్స్.. కారణం ఏంటంటే

తాజాగా 'కాఫీ విత్ కరణ్ సీజన్ 8'కి రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె తొలి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దీపికా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీపికా చేసిన కామెంట్స్ కు రణవీర్ సింగ్ మొఖం మాడిపోయింది. ఈ షోలో దీపికపై రణ్‌వీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో పాటు మరో వీడియో వైరల్ అవుతోంది. 2012లో దీపికను మొదటిసారి చూసినప్పుడు తనకు ఎలా అనిపించిందో రణవీర్ సింగ్ వివరించాడు.

Ranveer Singh: తొలిసారి దీపికాను ఎక్కడ చూశాడో చెప్పిన రణ్‌వీర్.. అంతా ఫేక్ అంటున్న నెటిజన్స్.. కారణం ఏంటంటే
Ranveer Singh, Deepika Padu
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 29, 2023 | 8:27 AM

ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కడ చూసిన రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె గురించే చర్చ జరుగుతోంది. తాజాగా ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 8’కి రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె తొలి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దీపికా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీపికా చేసిన కామెంట్స్ కు రణవీర్ సింగ్ మొఖం మాడిపోయింది. ఈ షోలో దీపికపై రణ్‌వీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో పాటు మరో వీడియో వైరల్ అవుతోంది. 2012లో దీపికను మొదటిసారి చూసినప్పుడు తనకు ఎలా అనిపించిందో రణవీర్ సింగ్ వివరించాడు. అయితే గతంలో ఆయన అనుష్క శర్మ  గురించి వివరిస్తూ అదే కథను చెప్పాడు. దాంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కరణ్ జోహార్ షోలో దీపిక గురించి రణ్‌వీర్ సింగ్ మాట్లాడాడు. ‘నేను టేబుల్‌పై కూర్చున్నాను. సమీపంలో ఒక తలుపు ఉంది. సముద్రానికి దగ్గరగా ఉండడంతో గాలి వీచింది. దీపికా ఆ తలుపు తెరిచినప్పుడు ఆమె జుట్టు ఎగిరిపోయింది’ అని ఎదో కథ రణవీర్ సింగ్ కాఫీ విత్ కరణ్‌లో చెప్పాడు. గతంలో అనుష్క శర్మ గురించి కూడా అదే చెప్పాడు. అది కూడా కాఫీ విత్ కరణ్ షోలోనే.

యశ్ రాజ్ ఫిల్మ్స్ ఆఫీసులో అనుష్కను రణ్‌వీర్ సింగ్ మొదటి సారి చూసినప్పుడు ఇదే సీన్ జరిగిందని తెలిపాడు. ఇప్పుడు దీపికా గురించి కూడా ఇదే కథను మార్చి చెప్పడంతో  పలువురు రణ్‌వీర్‌ సింగ్‌ కామెంట్స్ పై ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రేమ గురించి చెప్పమంటే ఒకటే కథను చెప్తున్నాడు అని కొందరు. మనోడు ఎంతమందితో ప్రేమాయణం నడిపాడో అని ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ప్రేమ విషయంలో రణ్‌వీర్ అబద్దాలు చెప్తున్నాడని అంటున్నారు కొందరు.

మూడేళ్ల పాటు డేటింగ్ చేసిన రణ్‌వీర్ దీపికను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 2015లో దీపికా పదుకొనేకు రణ్‌వీర్ సింగ్ ప్రపోజ్ చేశాడు. సముద్రం మధ్యలో ఉన్న ఓ దీవిలో దీపికకు ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు రణ్‌వీర్. దీపికా-రణ్‌వీర్‌ వివాహమై ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పెళ్లి వీడియోను విడుదల చేశారు. ఈ జంట సుదూర ఇటలీలో వివాహం చేసుకున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..