Ranveer Singh : భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన రోజు రణ్‌వీర్ సింగ్ సినిమా రాబోతోందా..
హీరో రణ్ వీర్ సింగ్, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ బయోపిక్ చిత్రాన్ని విష్ణు ఇందూరి...
Ranveer Singh : హీరో రణ్ వీర్ సింగ్, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ బయోపిక్ చిత్రాన్ని విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రణ్వీర్ సింగ్ ఈ మూవీలో కపిల్ దేవ్ గా నటిస్తుండగా కపిల్ భార్య పాత్ర దీపికా పదుకొనె చేయడం విశేషం. డైరెక్టర్ కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విష్ణు ఇందుకూరి, షాజిద్ నడియావాలా, కబీర్ ఖాన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది. 83 సినిమాను జూన్ నెలలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. మే నెలలో రెండు భారీ సినిమాలు రాధే సత్యమేవ జయతే 2 విడుదల అవుతుండగా.. అందుకే 83కి జూన్ మంచి టైం అని భావిస్తున్నారట. భారత క్రికెట్ జట్టు 1983 ప్రపంచ కప్ గెలిచిన రోజు జూన్ 25న.. కాబట్టి అదే తేదిన 83 విడుదల చేసే అవకాశాలుకనిపిస్తున్నాయి. కానీ అంతకన్నాముందే ఈసినిమా ప్రేక్షకులముందుకు వచ్చేఅవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే దీనిపైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Kajal Agarwal: తనకున్న వ్యాధిపై క్లారిటీ ఇచ్చి ఎమోషనల్ అయిన కాజల్.. షాక్‌లో ఫ్యాన్స్.!