Bellamkonda Sreenivas : టాలీవుడ్ యంగ్ హీరోకు బాలీవుడ్‌లో హీరోయిన్ దొరకడం లేదంట..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్... అల్లుడు శీను సినిమా తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ యంగ్ హీరో అనుకున్నస్థాయిల్లో రాణించలేక పోతున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు అయినప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు.
Bellamkonda Sreenivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్… అల్లుడు శీను సినిమా తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ యంగ్ హీరో అనుకున్నస్థాయిల్లో రాణించలేక పోతున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు అయినప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో రాక్షసుడు సినిమా తప్ప మరో హిట్ పడలేదు ఈ కుర్ర హీరోకి. దాంతో ఈ యంగ్ హీరో బాలీవుడ్ కు లో అదృష్టం పరికిష్నిచుకోవాలని చూస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నాడు.
అయితే ఈ యంగ్ హీరోకి ఇప్పుడు హీరోయిన్ టెన్షన్ పట్టుకుందట. వివి వినాయక్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు కోసం మేకర్స్ హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు. అయితే ఇంతవరకు సరైన హీరోయిన్ దొరకలేదట. స్టార్ హీరోయిన్స్ ను కొంతమందిని సంప్రదించిన సినిమాలతో బిజీగా ఉండటంతో నో చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌కు పెద్దగా స్కోప్ ఉండకపోవడం వల్లే ఎవరూ ఆసక్తి చూపించడం లేదన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి బెల్లంకొండ సరసన ఏ హీరోయిన్ ఫిక్స్ అవుతుందో..
మరిన్ని ఇక్కడ చదవండి :
Ranveer Singh : భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన రోజు రణ్‌వీర్ సింగ్ సినిమా రాబోతోందా..