R. Madhavan: మిమ్మల్ని ఫాలో అవ్వను అన్న నెటిజన్‌కు దిమ్మతిరిగే రిప్లే ఇచ్చిన మాధవన్
తాజాగా ఓ నెటిజన్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు హీరో మాధవన్. సినిమాలతో పాటూ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా మాధవన్ అభిమానులతో ముచ్చటిస్తూ..
సినిమా తారలు సోషల్ మీడియా లో చాలా రకాల విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. ఏ పని చేసిన విమర్శించే వారు.. ట్రోల్ చేశేవారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే చాలా మంది సినిమా తారలు రకరకాల ట్రోల్స్ బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఓ నెటిజన్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు హీరో మాధవన్. సినిమాలతో పాటూ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా మాధవన్ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. తాజాగా ఒక నెటిజన్ మిమ్మల్ని ఇక నుంచి ఫాలో అవ్వను అంటూ కామెంట్ చేశాడు. మాధవన్ ఓ ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో పై నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. దానికి మ్యాడీ డిఫరెంట్ గా స్పందించారు. ఇంతకు ఆ నెటిజన్ ఎందుకు అలా అనాల్సి వచ్చిందంటే..
తాజాగా మాధవన్ , రణవీర్ సింగ్ తో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో రణవీర్ మాధవన్ ను హగ్ చేసుకున్నారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ… లవ్ యు మై బ్రో.. అంటూ రాసుకొచ్చారు మాధవన్. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో పై నెటిజన్స్ రకరాలు గా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఈ ఫోటో పై స్పందిస్తూ.. “ఇప్పుడు నేను మిమ్మల్ని ఫాలో చేయడం లేదు..“ అని రాసాడు. మాధవన్ దానికి స్టైల్ గా సరే బ్రో అంటూ సమాధానం ఇచ్చాడు. అలాగే ఇంకొంతమంది కూడా ఈ ఫోటో పై రియాక్ట్ అయ్యారు.
అయ్యో… మీరు ముందు స్టార్ హీరోల లిస్ట్ లో లేరు.. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కాదు… ఒక సాధారణ మనిషిగా ఉండటం మీకు ఎలా అనిపిస్తుంది!!“ అని మాధవన్ ని ప్రశ్నించాడు. దానికి అతడు బదులిస్తూ “ఎల్లప్పుడూ నేను సామాన్యుడినే. అయినా కూడా స్టార్ కావడం ఇష్టం“ అని అన్నారు. ఇక మాధవన్ ఇటీవలే రాకట్రీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Love you my bro .. ❤️❤️❤️???@RanveerOfficial @NBA pic.twitter.com/1OuF2lHHLU
— Ranganathan Madhavan (@ActorMadhavan) October 6, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.