బాలీవుడ్ హీరో గోవిందా సతీమణి సునీత అహుజా చిక్కుల్లో పడ్డారు. ఇటీవల మే 15న ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని సందర్శించిన ఆమె.. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫోటోస్ కాస్త వైరల్ కావడంతో నెటిజన్స్ సునీత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఆలయ గర్భగుడిలోకి సునీత హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్లడమే. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ గర్భగుడిలోకి హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్లిందని.. భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకోలేదు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. ఉజ్జయిని మహాంకాళి ఆలయంలోకి బ్యాగ్స్ తీసుకెళ్లకూడదనేది ప్రధాన నియమాలలో ఒకటి.
అసలు విషయానికి వస్తే.. మే 15న సినీ నటుడు గోవిందా భార్య అహుజా ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. గర్భగుడిలో సునీతా అహుజా హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్లడమేంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా..బ్యాగును లోపలికి తీసుకెళ్లేందుకు ఎలా అనుమతించారనే విషయాన్ని సీసీ ఫుటేజీని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఆ సమయంలో భద్రతా సిబ్బంది గేటు వద్ద తనిఖీలలో నిమగ్నమై ఉన్నారని.. ఆలయ నిర్వాహకులు సందీప్ సోనీ పేర్కొన్నారు. లోపలికి బ్యాగ్స్, పర్సులు తీసుకెళ్లకుండా చూడడం వారి బాధ్యత అని.. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.