PM Modi: ప్రధాని మోడీ పుట్టిన రోజున గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రముఖ నిర్మాత.. పేదల కోసం తన ఆస్తిలో ఏకంగా..

ఈరోజు (సెప్టెంబర్ 17) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే సినీ సెలబ్రిటీలు కూడా మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మహావీర్ జైన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు

PM Modi: ప్రధాని మోడీ పుట్టిన రోజున గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రముఖ నిర్మాత.. పేదల కోసం తన ఆస్తిలో ఏకంగా..
Mahaveer Jain, PM Narendra Modi
Follow us
Basha Shek

|

Updated on: Sep 17, 2024 | 4:16 PM

ఈరోజు (సెప్టెంబర్ 17) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే సినీ సెలబ్రిటీలు కూడా మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మహావీర్ జైన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాదాసీదా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నఆయన తన సంపదలో 90 శాతం విరాళంగా అందజేస్తానని ప్రకటించారు. ఇబ్బందుల్లో ఉన్న పేదలు, అవసరమైన వారికి ఈ డబ్బును పంచుతానిని మహావీర్ జైన్ నిర్ణయించుకున్నారు. ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహావీర్ మాట్లాడారు. ‘మన ప్రధాని స్వామి వివేకానంద తత్వాన్ని స్వీకరించారు. ఇతరుల కోసం బతికేవాళ్లే బతకగలరన్న సామెతను స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే మోదీ పాటిస్తున్నారు. మోదీ లాంటి నాయకుడు మన దేశంలో ఉన్నందుకు మనెంతో గర్వ పడాలి. అలాగే ఇందుకు గానూ కృతజ్ఞతతో నూ ఉండాలి. మోదీ కారణంగానే ప్రపంచం మొత్తం భారతదేశాన్ని ఎంతో గౌరవంగా చూస్తోంది. భారతీయులమని చెప్పుకునేందుకు మేమెంతో గర్విస్తున్నాం’ అని మహావీర్ తెలిపారు. ఆ తర్వాత ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూ, “భారతదేశం కోసం మీరు చేస్తున్న అద్భుతమైన ప్రయత్నాలకు మా అందరి నుండి ధన్యవాదాలు సర్. జన్మదిన శుభాకాంక్షలు’ అని మహావీర్ చెప్పుకొచ్చారు.

‘మన చలనచిత్ర పరిశ్రమలో, సూరజ్ ఆర్ బర్జాత్యా, అమీర్ ఖాన్,  రాజ్‌కుమార్ హిరానీ వంటి ప్రముఖులు ఎంతో నిజాయతీగా అర్థవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. నేనెప్పుడూ వీరినే ఆదర్శంగా తీసుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు మహావీర్ జైన్.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోడీతో మహావీర్ జైన్, ఇతర బాలీవుడ్ నటీనటులు..

కాగా 2011లో విడుదలైన ‘దేఖ్ ఇండియన్ సర్కస్’ ద్వారా నిర్మాతగా మారారు మహావీర్. ఆ తర్వాత’ఛలో జీతీ హై’, ‘మలాల్’, ‘ఊంచాయి’, ‘రామ్ సేతు’, ‘గుడ్ లక్ జెర్రీ’ వంటి చిత్రాలను నిర్మించి బాలీవుడ్ ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు.

షారుఖ్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ లతో మహావీర్ జైన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.