Madhuri Dixit: ‘ఏజ్ ఈజ్ జ‌స్ట్ ఏ నంబ‌ర్’.. ఆ అందాల బొమ్మ‌కు 54 ఏళ్లు అంటే న‌మ్ముతారా…?

|

Jun 04, 2021 | 3:05 PM

ఐయామ్ స్టిల్ గార్జియస్ అంటున్నారు సీనియర్ స్టార్ మాధురీ దీక్షిత్‌... 80స్‌, 90స్‌లో స్టార్ హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌ను రూల్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పటికీ గ్లామర్‌ విషయంలో..

Madhuri Dixit: ఏజ్ ఈజ్ జ‌స్ట్ ఏ నంబ‌ర్.. ఆ అందాల బొమ్మ‌కు 54 ఏళ్లు అంటే న‌మ్ముతారా...?
Madhuri Dixit
Follow us on

ఐయామ్ స్టిల్ గార్జియస్ అంటున్నారు సీనియర్ స్టార్ మాధురీ దీక్షిత్‌… 80స్‌, 90స్‌లో స్టార్ హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌ను రూల్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పటికీ గ్లామర్‌ విషయంలో కుర్ర హీరోయిన్లకు పోటి ఇస్తున్నారు. లుక్స్‌ మాత్రమే కాదు.. స్టైలింగ్‌, గ్రేస్‌ విషయంలోనూ సరిలేరు నాకెవ్వరు అంటూ ప్రాక్టిక‌ల్‌గా చేసి చూపిస్తున్నారు. సీనియర్ హీరోయిన్లంతా గ్లామర్ ఇమేజ్‌ను పక్కన పెట్టేస్తే గార్జియస్‌ మాధురీ దీక్షిత్ మాత్రం.. ఇప్పటికీ అభిమానుల కలల రాణిగానే కనిపిస్తున్నారు. సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నా… టెలివిజన్‌లో… సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్ చల్ చేస్తున్నారు. యంగ్ జనరేషన్ హీరోయిన్లకు జెలస్‌ కలిగించేలా ఫోటో షూట్‌లతో రచ్చ చేస్తున్నారు. పెళ్లికి ముందు వరకు హీరోయిన్‌గా నెంబర్ వ‌న్‌ పొజిషన్‌ను ఎంజాయ్ చేసిన మాధురి… ఆ తరువాత సినిమాల విషయంలో స్లో అయ్యారు. క్యారెక్టర్‌ రోల్స్.. అది కూడా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ.. తన స్టార్ ఇమేజ్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. 80స్‌లో ఏక్ దో తీన్‌ అంటూ డ్యాన్సింగ్ ఫ్లోర్ మీద దుమ్ములేపిన మాధురి… దేవ్‌దాస్‌లో డోలా రే డోలా పాటలోనూ అంతే గ్రేస్ చూపించారు.

గత పదేళ్లుగా క్యారెక్టర్‌ రోల్స్ మాత్రమే చేస్తున్న మాధురీ… ఇప్పటి హీరోయిన్‌లకు పోటి ఇచ్చే రేంజ్‌లో గ్లామర్‌ ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తున్నారు. ఏ జవానీ హై దివానీ సినిమాలో యంగ్ హీరో రణబీర్‌ కపూర్‌తో కలిసి మాధురీ చేసిన డ్యాన్స్‌… ఇప్పటికీ ఓ రేంజ్‌లో ట్రెండ్‌ అవుతోంది. లైఫ్‌ స్టైల్ విషయంలోనూ కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గటం లేదు ఈ సీనియర్ బ్యూటీ. ప్రజెంట్ ఓ డ్యాన్స్ రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న ఈ సీనియర్‌ స్టార్‌… బుల్లితెర మీద చేసే సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా స్పెషల్ ఎపిసోడ్స్‌లో మాధురి చేసే పర్ఫామెన్స్‌ కోసమే… ఆ షోస్‌ చూసే ఆడియన్స్‌ కూడా ఉన్నారంటేనే మాధురి ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.


తన ఫిట్నెస్‌ సీక్రెట్స్‌ను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు మాధురీ దీక్షిత్. రెగ్యులర్‌గా యోగా, వర్కవుట్స్‌తో పాటు… కొడుకుతో క‌లిసి ఆన్ అండ్ ఆఫ్‌… డ్యాన్స్ ప్రాక్టీస్‌ కూడా చేయటం వల్లే తాను 54 ఏళ్ల వయసులో.. ఫిట్ అండ్‌ హెల్దీగా ఉన్నానంటున్నారు ఈ సీనియర్ స్టార్‌.

Also Read: జూన్‌ నెలలో మాతో ఎంటర్‌టైన్‌మెంట్‌ మామూలుగా వుండదు అంట‌న్న ఓటీటీలు.. లిస్ట్ ఇదిగో

టాప్ మూవీస్‌కు రీ-షూట్ బెడ‌ద‌.. రిపేర్లు త‌ప్ప‌వ‌ట‌.. వివ‌రాలు